Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో రూ.2 కోట్లు
- అధికారుల నిర్లక్ష్యం.. ఒక్కో వాలంటరీకి రూ.30వేలు నష్టం
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యావాలంటరీ గౌరవ వేతనాల చెల్లింపులో జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. 2019-20 విద్యా సంవత్సరంలో వాలంటీర్లకు వేతనాలు చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం కారంణంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది విద్యా వాలంటీర్ల జీతాలు కోల్పోయారు. విద్యావాలంటరీల పెండింగ్ వేతనాలకు సంబంధించి 2020 మార్చి 24న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ నుండి నిధుల దస్రం విడుదల చేసింది. జీఓ నెం.42ను విడుదల చేసినప్పటికీ జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా నిర్ణీత గడువులోపు వేతనాల చెల్లింపునకు బిల్లులు చేయకపోవడంతో నిధులు మురిగిపోయాయని కార్యాలయ ఉద్యోగులు అంటున్నారు. దీంతో వారికిచ్చే గౌరవ వేతనానికి దిక్కులేకుండా పోయింది. ఈ ఏడాది కూడా వేతనాలు వస్తాయని ఆశగా ఎదురుచూశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరం ముగిసినప్పటికీ వివిలకు వేతనాలు రాలేదు. ఈ విషయంలో విద్యాశాఖ అనుసరి స్తున్న విధానాలను పట్టిచూస్తే వేతనాలు చెల్లింపునకు మొండి చెయ్యి చూపించే విధంగా ఉందని స్పష్టం అవుతుంది. విద్యావాలంటరీలో అనేక దఫాలుగా విద్యాశాఖా ధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ విద్యాశాఖాధి కారులు నిర్లక్ష్యం, మొండి వైఖరి కారణంగా విద్యావాలం టరీలకు 3నెలల వేతనాలు లేకుండాపోయాయి. ఒక్కోక్కరికి సుమారు రూ.30 వేల వరకు నష్టపోయారని తెలుస్తుంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కోవిడ్ కారణంగా గత విద్యా సంవ త్సరం వారికి ఉపాధికూడా లేదు. రెండు రకాలుగా వారు నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాశాఖ అనుసురిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగా విద్యావాలంటరీలు సుమారుగా రూ.2 కోట్ల మేర నష్ట పోయారు. గతంలో కలెక్టర్ నిర్వహించిన డైయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి బాధిత విద్యావాలంటీర్లు ఫోన్‌ద్వారా విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారి బోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ప్రయి వేటు టీచర్లకు నెలకు రూ.2వేలు, 25 కేజీల బియ్యం ఇస్తా మని ప్రకటించారు. ఈ నేపద్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పర్మినెంట్ ఉపాధ్యాయులకు సమానంగా భోధన చేసిన వాలంటరీల పరిస్థితి ఏమిటని...? పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే వారి అభ్యున్నతికి పాటు పడిన విద్యావాలంటరీల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని తెలుస్తుంది. ఇప్పటికైన కలెక్టర్ ఈ విషయంలో చొరతీసు కుని వారికి పెండింగ్ వేతనాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.
విద్యావాలెంటరీలకు బృతి రూ.5 వేలు ఇవ్వాలి : టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుండి కరోనా లాక్డౌన్ తదితర కారణాల రీత్యా 13 నెలలుగా జీత భత్యాలు లేక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తాత్కాలిక బృతిగా రూ.5 వేలు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన కొత్తగూడెం వచ్చిన సందర్భంగా ప్రకటన చేశారు.