Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రామీనాభివృద్ధి అధికారి విద్యాచందన
నవతెలంగాణ-ముదిగొండ
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మెరుగు విద్యాచందన అన్నారు. మండల పరిధిలో పమ్మి గ్రామంలో శనివారం ఆమె పర్యటించారు. ఈసందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, వర్మి కంపోస్టు షెడ్డు, రోడ్డుకు ఇరువైపుల వేసిన హరితహారం మొక్కలను ఆమె నిశితంగా పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపిడి వెంకటపతిరాజు, కల్లూరు క్లస్టర్ ఏపిడి టి.శ్రీనివాసరావు, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, ఈజీఎస్ ఏపీవో పి.అజరు కుమార్, ఈసి పి.కిరణ్ కుమార్, గ్రామపంచాయతీ సర్పంచ్ కొండమీద సువార్త, పంచాయతీ సెక్రటరీ నెల్లూరి మణిలు పాల్గొన్నారు.