Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యాక్సినేషన్ మేనేజర్ సిహెచ్ రమణ
నవతెలంగాణ- కల్లూరు
కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు కృషి చేయాలని, జిల్లాలో వ్యాక్సినేషన్ కొరత లేదని జిల్లా వ్యాక్సినేషన్ మేనేజర్ సిహెచ్ రమణ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ శనివారం సందర్శించారు. ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేయించుకోవాలని, రెండు డోసు వేయించుకున్న 15 రోజులు తర్వాత పూర్తి వ్యాధి నిరోధకాలు శరీరంలో తయారవుతాయన్నారు. జిల్లాలో 13 వేల కోవిడ్ డోసులు అందుబాటులో ఉన్నాయని, వ్యాక్సిన్ కొరత లేదని అన్నారు. తర్వాత వ్యాక్సిన్ నిల్వ పాయింట్‌ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సత్య చైతన్య, సిహెచ్‌వో రేవతి, సూపర్వైజర్లు రామారావు, శాంతకుమారి, ఆశాలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.