Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగరపాలక సంస్థ ఎన్నికలకు మోగనున్న నగారా
- సన్నద్ధమవుతున్న అధికార యంత్రాంగం
- 60 డివిజన్ల ఆధారంగా నామినేషన్ల కేంద్రాలు
- ఎన్నికల నిర్వహణ విధి
- విధానాలపై కలెక్టర్ దిశానిర్దేశం
ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు ఆసన్నమవుతున్నాయి. ఏ క్షణానైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారయంతాంగం సన్నద్ధమవుతోంది. మే నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డివిజన్ల పునర్విభజన ఇప్పటికే పూర్తయింది. ఈనెల 14న ఓటర్ల తుది జాబితా అనంతరం డివిజన్ల రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్లు కూడా ఖరారైతే షెడ్యూల్ వెలువడటమే తరువాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక టీటీడీసీ భవన్లో శనివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు ఆసన్నమవుతున్నాయి. ఏ క్షణానైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారయంతాంగం సన్నద్ధమ వుతోంది. మే నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డివిజన్ల పునర్విభజన ఇప్పటికే పూర్తయింది. ఈనెల 14న ఓటర్ల తుది జాబితా అనంతరం డివిజన్ల రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్లు కూడా ఖరారైతే షెడ్యూల్ వెలువడటమే తరువాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక టీటీడీసీ భవన్లో శనివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
డివిజన్ల ఆధారంగా నామినేషన్ కేంద్రాలు
నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్ల ఆధారంగా నామినేషన్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ బాక్స్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌లు ఇలా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అనువైన భవనాలను సైతం ఎంపిక చేస్తున్నారు. అబ్జర్వర్స్, ప్రొటోకాల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు, మ్యాన్‌పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సెస్, మెటీరియల్ మేనేజ్మెంట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఖర్చులు, శాంతిభద్రతల పర్యవేక్షణ, శిక్షణ, రవాణా, మ్యాప్స్ తయారీ, రవాణా, వెబ్‌కాస్టింగ్, రిపోర్ట్స్, కంప్యూటరైజేషన్ తది తరాలుగా పనులను విభజించారు. ఆయా విభాగాలకు ప్రత్యేకంగా నోడల్ అధికారులనూ ఎంపిక చేశారు.
నేటితో అభ్యంతరాల గడువు పూర్తి
డివిజన్ల విభజనకు సంబంధించిన అభ్యంతరాల గడువు ఆదివారం నాటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 60 డివిజన్లలో గుర్తించిన 365 పోలింగ్ కేంద్రాల ముసాయిదాను నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్‌జయంతి ఇప్పటికే విడుదల చేశారు. రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ వాటిని అందజేశారు. డివిజన్ల వారీగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాల సంఖ్యను కూడా నిర్ణయించారు. అత్యధికంగా 53వ డివిజన్లో 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ డివిజన్లో 5,520 మంది ఓటర్లున్నారు. 2, 14, 32, 49, 52 డివిజన్లలో ఎనిమిది, 3, 9, 15, 18, 19, 21, 23, 26, 29, 37, 44, 54, 55, 57 డివిజన్లలో ఏడు, 4, 5, 6, 10, 11, 16, 17, 27, 30, 31, 33, 38, 39, 41, 42, 43, 45, 46, 51, 56, 60 డివిజన్లలో ఆరు, 1, 7,8, 20, 24, 25, 28, 34, 40, 47, 48, 50, 58, 59 డివిజన్లలో ఐదు, 35, 36 డివిజన్లలో నాలుగు, 22వ డివిజన్ (3,066 మంది ఓటర్లు) లో మూడు చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.