Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి యువత జ్యోతిబా పూలే ను ఆదర్శంగా తీసుకోవాలి
- సీపీఎం, కేవీపియస్
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపడానికి తన జీవితాంతం కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యావృద్ధికి బాటలు వేసిన మహాత్మ జ్యోతిబా పూలే 195 జయంతి వేడుకలను మండలంలోని ఎం. వెంకటాయపాలెం, పెద్దతండ పంచాయితీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సీపీఎం, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సీపీఎం నాయకులు నందిగామ కృష్ణ, కేవీపియస్ నాయకులు పాపిట్ల సత్యనారాయణలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జీవితాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అన్నారు. సమాజంలో అనేక ఇబ్బందులకు గురైన నిమ్నజాతులను మేల్కొల్పి వారి హక్కుల సాధనకు కృషిచేసిన మహాత్ముడు పూలే అన్నారు. నేటి యువత పూలేను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు యుగంధర్, కనకం గురునాథం, పుల్లారావు, వెంకటేశ్వర్లు, గాంధీ, నవీన్, సంగయ్య, సిపిఎం నాయకులు ఏటుకూరి ప్రసాద్ రావు, నందిపాటి లక్ష్మయ్య, ఏనుగు గోవిందరావు, సత్యం, లక్ష్మి, సీత, గోపి, సత్యవతి, సిహెచ్.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.