Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ముఖ్యమంతి కేసీఆర్ సారధ్యంలో కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నీ రంగాల్లో జెడ్ స్పీడ్ స్పీడ్తో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగుతున్నాయని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని మేమంతా ఒక్కటేనన్నారు. కేసీఆర్ సారధ్యంలో కేటీఆర్ జెండా నీడలో పని చేస్తామని స్ఫష్టం చేశారు. ముఖ్యమంత్రి కోరికమేరకు మా అందరి కోరికమేరకు చాలా రోజుల తరువాత పార్టీలో చేరిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమన్నారు. గిరిజనులు అత్యధికంగా ఉన్న నియోజకర్గం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అండదండలు అవసరమన్నారు. గడిచిన రెండున్నర ఏళ్లలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను పార్టీలోకి రావాలని అభ్యర్ధించ మన్నారు. వేరే పార్టీ జెండా, అజెండాతో గెలిచి ప్రజల కోరికలకు అనుగుణంగా అభివృద్ధి చేయలేక పోతున్నానే భావనతో టీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో శుభపరిణామమన్నారు.
పదవులున్న లేక పోయిన ప్రజల ప్రేమాభిమా నాలు ప్రభుత్వ అండదండతలో వెనుకబడిన అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపడం కోసం శాయశక్తుల కృషి చూస్తామన్నారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత తొలిసారి కలిసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు.