Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వాతావరణ మబ్బులతో రైతన్న
ఆందోళన
అ కొనుగోలు కోసం రైతన్న ఎదురుచూపు
నవతెలంగాణ-కల్లూరు
రాష్ట్రంలోనే మొట్టమొదటి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి ఆర్భాటంగా ప్రారంభించి రోజులు గడుస్తున్నా ఆదివారం నాటికి కుడా కొనుగోలు కేంద్రాల్లో కాటాలు వేయకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రబీలో పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసి రైతులు సిద్ధం చేసుకున్నారు.ఈ నెల 6వ తేదీన మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని లింగాల గ్రామాలో ప్రారంభించారు. కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. మండలంలో రబీ కోతలు ప్రారంభమై దాదాపు 20 రోజులుకు పైగా కావొస్తుంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించే లోపే సగం మంది రైతులు పచ్చి ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవటం జరిగింది. తొలుత 77 కేజీల బస్తా ధాన్యాన్ని 1070 రూపాయలకు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రకటించడం జాప్యం కావడంతో రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్మటానికి ముందుకు రావటంతో ఆ ధరను కాస్తా 70 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈలోగా ప్రభుత్వం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని ప్రకటించడంతో రైతులు ధర తక్కువకు ఎందుకు అమ్ముకోవాలని ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం శుభ్రం చేసి అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసి సిద్ధం చేసారు. మండలంలో అప్పటికే సగం మంది రైతులు ధాన్యాన్ని ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు వద్ద అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు చెన్నూరు సొసైటీ పరిధిలో లింగాల, చెన్నూరు, చండ్రుపట్ల, ఎర్ర బోయినపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడికి పంపించాలో అర్థంగాక సొసైటీ ఆధ్వర్యంలో ఇంకా కాటాలు ప్రారంభించలేదు.
జిల్లాలో ఆరు బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి రబిలో పండించిన ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లుకే తోలే అవకాశం ఉంది. నాయకులు చెప్పే మాటలకు అధికారులు చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉండటం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అన్ని అనుమతులు మంజూరు చేయకుండా హడావుడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వాతావరణం ఎప్పటికప్పుడు మబ్బులు పడుతుండటంతో వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందే మోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉన్న ఆరు బాయిల్డ్ రైస్ మిల్లులో మిల్లులకు పంపించాలనే ఎలాట్మెంట్ ఇంకా సొసైటీలకు అందకపోవడం వల్లే కొనుగోళ్లు ప్రారంభించలేదని సొసైటీ వారు చెబుతున్నారు.
ఎలాట్మెంట్ రాగానే కొనుగోళ్లు ప్రారంభిస్తామని రైతులు అడిగితే సమాధానం చెబుతున్నట్లు రైతులు అంటున్నారు. జిల్లాలో రబీలో పండించే ధాన్యం కొనుగోలు చేయాలంటే బయట జిల్లాల్లోని బాయిల్డ్ రైస్ మిల్ కూడా అనుమతిస్తేనే సాధ్యపడుతుందని రైతులు అంటున్నారు.
గత రబీలో పండించిన ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లుకు తోలగా ఇక ఆ ధాన్యాన్ని బియ్యం ఆడించి సివిల్ సప్లై కి పంపించాల్సి ఉంది. ప్రభుత్వం గోడౌన్లో బియ్యం నిండిపోవటంతో ఈ బియ్యాన్ని తీసుకోకపోవటం వల్ల తొలిన ధాన్యం ఎలుకలు కొట్టి తరుగు వచ్చి తాము నష్టపో యే ప్రమాదం ఉందని మిల్లు యజమానులు వాపోతున్న ట్లు సమాచారం. అందువల్లే మిల్లు యజమానులు ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటు న్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.