Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూలే స్పూర్తితో కేసీఆర్ పాలన : ఎంపీ నామ
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అసమానలతో తులతూగుతున్న సమాజంలో ఆవిర్భవించిన వేగుచుక్క మహాత్మ బాపురావ్ పూలే అని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా ఎంపీ నామ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి పూలే చేసిన సేవలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. సమాజంలోని వివక్షతను అరికట్టేందుకు పూలే చేసిన పోరాటం అద్బుతమని పేర్కొన్నారు. సమాజంలో ఎదగాలంటే విద్య అవసరమని భావించి విద్యానందిస్తూ సామాజిక రుగ్మతలపై పోరాటం సాగించారని నామ పేర్కొన్నారు. నేటి యువత పూలే స్పూర్తితో బాగా చదువుకొని, జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నామ ఆకాక్షించారు. ఫూలే స్ఫూర్తితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు.