Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
రైతుల నడ్డివిరిచే నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్ అన్నారు. మండలంలోని ఏదులాపురం గ్రామంలో ఆదివారం ఆల్ ఇండియా కిసాన్ 86వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ సభ జెండాను రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉరడీ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మాదినేని రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత నాలుగు నెలలుగా ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎరువులపై 57 శాతం రేట్లు పెంచి రైతులను అధోగతి పాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు మామింళ్ల సంజీవరెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు గడ్డం వీరబాబు, బ్రహ్మయ్య, నాగయ్య, మధు రెడ్డి, లింగయ్య, అనిష్, ఉపేందర్, రాజీవ్, టీంకు, ప్రతాప్, మనోహర్ పాల్గొన్నారు.