Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీెపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ పిలుపు
నవతెలంగాణ-ఖమ్మం
మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సుందరయ్య భవన్ లో జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ కులవ్యవస్థ నిర్మూలనకై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే యని అన్నారు. అతి గొప్ప మనసున్న జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, బండారు రమేష్, అకడమిక్ సెల్ నాయకులు టీఎల్. నర్సయ్య, రఫీ, అఫ్జల్, డా. భారవి, నాదెండ్ల శ్రీనివాస్, విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.