Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎంపీజే అధ్యక్షులు ఎస్కే ఖాసిం
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలో ముస్లిం మైనారిటీలు 17 శాతం కంటే ఎక్కువ వున్నారని, రాబోవు నగర కార్పొరేషన్ ఎన్నికలలో 12శాతం కంటే ఎక్కువగా మైనారిటీలకు సీట్లు కేటాయించి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను ఎంపిజె జిల్లా అధ్యక్షులు ఎస్.కె. ఖాసిం డిమాండ్చేశారు. ఆదివారం స్థానిక మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ముస్లిం మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీ ప్రకారం ఎన్నికలలో సీట్లు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎంపిజె సభ్యులు పాల్గొన్నారు.