Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) వల్లే నీకీ గుర్తింపు
నవతెలంగాణ-బోనకల్
పదవుల కోసం మూడు పార్టీలు మారిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కు వైఎస్ షర్మిల గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని ఆ పార్టీ మండల యువజన నాయకుడు గణపవరపు మురళి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఖమ్మంలో జరిగిన సంకల్ప సభ విజయం అనంతరం టీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులకు గురై తట్టుకోలేక షర్మిల వారి కుటుంబం గురించి విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. ఈ రోజు లింగాల కమల్ రాజు జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయిలో ఉండటానికి కారణం మాతృ పార్టీ అయినా సిపిఎం పార్టీ పుణ్యమేనని గుర్తుంచుకోవాలన్నారు. సీపీఐ(ఎం) వల్లే నీకు కు గుర్తింపు వచ్చిందని ఆ పార్టీకి వెన్ను పోటు పొడిచి ఎమ్మెల్సీ పదవి ఆశించి వైఎస్ఆర్సి పి పార్టీలో చేరాడని అక్కడ కూడా అ పదవి రాకపోవడంతో మళ్లీ పదవి కోసం నాటి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం చేరిన విషయం అప్పుడే మర్చిపోయారా అని కమల్ రాజు ని ఆయన ప్రశ్నించారు. మీ జీవితంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చివరదని మరల ఏ పదవి రాదనే విషయం తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి వైయస్ షర్మిల నాయకత్వంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.