Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం కార్పోరేషన్ గుట్టలబజార్‌లోని జహీర్‌పుర ప్రాంతానికి చెందిన డుంగ్రోత్ వీరూనాయక్ కుటుంబానికి అండగా నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి రూ. 25వేల విలువైన చెక్కును ఆదివారం ఖమ్మం, జూబ్లీపూరలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. టిఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కుమారుడు నామ భవ్యతేజ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి చేతుల మీదుగా వీరునాయక్ భార్య స్వాతి కు చెక్‌ను అందజేశారు. టిఆర్ఎస్ నాయకుడు అయిన వీరూనాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, ఉప్పనూతల నాగేశ్వరరావు, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, సరిపూడి గోపి సందేశ్, తాళ్లూరి హరీశ్, ఆర్.కృష్ణప్రసాద్, రాజా, నవీన్, భార్గవ్ పాల్గొన్నారు.
ట్రస్ట్ నీడలో ఉన్నత స్ధానాలకు ఎదిగారు...
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలోని నామ ముత్తయ్య ట్రస్ట్ ఔదార్యం ప్రశంసలందుకుంటోంది. సామాజిక కార్యక్రమాల్లో మేటిగా ఉంది. ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఎంపీ నామ నేనున్నాంటూ అభయం ఇచ్చి చేయూతనందిస్తూ, ప్రశంసలందుకుంటున్నారు. ఆపదలో ఉన్న ఎంతో మంది అభాగ్యులకు ట్రస్ట్ ద్వారా భరోసా కల్పించారు. లాక్డౌన్లో అన్నార్తులకు పెద్ద ఎత్తున అన్నదానం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో రూ. 1కోటీ 50లక్షల విలువైన శానిటైజర్, మాస్కులు, ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు. లాక్డౌన్లో అన్నార్తులకు భోజనం, వలస కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ, భోజన ఏర్పాట్లు, వైద్య, పారిశుద్య, ప్రభుత్వ డాక్టర్లు, ,పోలీసులకు మాస్కులు ,శానిటైజర్లు పంపిణీ చేసిన ఘనత ట్రస్ట్‌ది. ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్ధులకు ఉన్నత చదువులకు ఆర్ధిక సాయం చేశారు. సాయం పొందిన వారంతా డాక్టర్లు, ఇంజీనర్లు అయ్యారు.