Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
మరుగునపడుతున్న కళలను రానున్న భవిష్యత్తు తరాలకు భరత నాట్యంపై మక్కువ పెంచు కునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఖమ్మం టూటౌన్ సీఐ శ్రీధర్ తెలిపారు. ఆదివారం నగరంలోని గాంధీచౌక్ లో గల సాయిబాబా దేవస్థానంలో శ్రీ నటరాజ నృత్యనికేతన్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లలిత కళలను ఆదరించడంతో పాటు భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్, కూచిపూడి, కథక్ తదితర రంగాల్లో చిన్నతనం నుంచి శిక్షణనిచ్చి ప్రతిభ చూపేవిధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ నటరాజ నృత్యనికేషన్ వ్యవస్థాపకులు ఎస్. మాధవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఛైర్మన్ వేములవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు