Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
సామాజిక తత్వవేత్త దార్శనికుడుగా లిమహాత్మా ఫూలే సిద్ధాంతాలు ఆచారణలో పెడితే బహుజన రాజ్యాధికారం సిద్ధిస్తుందని తెలంగాణ ఉద్యమకారుల ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల సోమయ్య, తొలి మలిదశ ఉద్యమ కారుడు గుంతేటి వీరభద్రం అన్నారు. ఆదివారం పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్లోని జ్యోతిరావుఫూలే విగ్రహానికి పూలమాలలేసి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నివాళి అర్పించారు.
కూసుమంచి : మండలంలోని పాలేరు గ్రామంలో కేవీపీఎస్, సీఐటీయూల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి తిప్పర్తి. సాయి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పూలమాలలేసినివాళి అర్పించారు. సీఐటీయూ జిల్లా నాయకులు గోపె. వినరు కుమార్, గోపె కార్తిక్, గోపి, నవిలె. గోపి, కంపాటి. వెంకటేశ్వర్లు, స్వేరోస్ గోపె.నవ్య, నాగ పాల్గొన్నారు.
ఖమ్మం : కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన
తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏఐటియుసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సింగు నర్సింహారావు, డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఖమ్మంలో
ఏఐటియుసీ, తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్, బి.కె.ఎం.యు, తెలంగాణ గిరిజన సమాఖ్య టిజిఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఎదుట గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బి.కే.ఎం.యు. రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు పగిడిపల్లి ఏసు, ఏఐటియుసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, తెలంగాణ గిరిజన సమాఖ్య టిజిఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి బోడా వీరన్న, దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుమ్మరి గొపాల్ తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల : మండల కేంద్రంలో జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కల్లూరు గురుకుల ప్రిన్సిపాల్ జి విజయ కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా 5వ తరగతి గురుకుల ప్రవేశాలకు సంబంధించి కరపత్రాలను విద్యార్థులు తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ బార్సు స్కూల్ టీచర్స్ బి లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, కల్లూరు గర్ల్స్ స్కూల్ టీచర్ దేవకి, స్థానికులు ప్రముఖ జానపద గాయకులు కాలవ కట్ల జాన్, అన్నం ఫౌండేషన్ నెంబర్ కొత్తపల్లి నాగేశ్వరరావు, కాలువ కట్ల బెంజిమెన్ పాల్గొన్నారు.
సత్తుపల్లి : అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే శ్రమించారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, నారాయణవరపు శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి జ్యోతిరావు పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలారాణి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు చిత్తలూరి ప్రసాద్, బీజేఆర్ సంఘం అధ్యక్షులు పురుషోత్తం, రాజేశ్వరరావు, బీసీ సంఘం డివిజన్ అధ్యక్షులు దుస్స వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు పిడుగు సత్యనారాయణ, రజక సంఘం ప్రధాన కార్యదర్శి తెలగారపు అప్పారావు, పట్టణ అధ్యక్షులు నాగభూషణం, నాయకులు శ్రీనివాసరావు మరీదు ప్రసాదు, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు ఆర్టీసీ సంఘం నాయకులు గడ్డం శ్రీనివాసరావు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం : పూలె జయంతి సందర్భంగా ఖమ్మం చైతన్య వేదిక ద్వారా పూర్ణచందర్, బాబూరావుతో పాటుగా పెవిలియన్ వాకర్స్ కార్యనిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో కోటయ్య, కనకయ్య, గోవర్ధన్, ఏకాంబరం రావు, డాక్టర్ నర్సింహారావు, నారాయణ, కృష్ణారెడ్డి, సీతారామయ్య, గోవింద, కమిటీ ఆర్గనైజర్ కాంతారావులు నివాళి అర్పించారు.
ఎర్రుపాలెం : గొప్ప సంఘసంస్కర్తగా ఎనలేని సేవలు చేశారని బాలికా విద్యకు ప్రాధాన్యత కల్పించి అంటరాని తనాన్ని పాలదోరిన మహా మనిషి మహాత్మ జ్యోతిరావు పూలే అని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు తహసీల్దార్ కార్యాలయం నందు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శిరీష, జెడ్పిటిసి కవిత, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలి అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.