Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభాశంకర్ హాస్పటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ క్రాంతికుమార్
నవతెలంగాణ-భద్రాచలం
హాస్పిటల్స్‌లో ఉత్పత్తి అయ్యే పొల్యూషన్‌ను నియంత్రించేందుకు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ప్రభా శంకర్ హాస్పటల్ వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ప్రభా శంకర్ హాస్పటల్స్‌లో ఉత్పత్తి అయ్యే పొల్యూషన్‌ను ఆయన వివరించారు. హాస్పిటల్స్‌లో ఈ మధ్యకాలంలో బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ సరిగా ఉండటం లేదని అన్నారు. హాస్పిటల్స్‌లో బయో వేస్ట్‌ను ఇష్టం వచ్చినట్టు పడ వేయకుండా ఆయా వేస్ట్‌ను విడివిడిగా డస్ట్ బిన్లలో వేయాలని ఆయన పేర్కొన్నారు. హాస్పిటల్స్‌లో ఉత్పత్తి అయ్యే బయోమెడికల్ వేస్ట్‌ని ఏ రకంగా వేరు చేయాలి అనే అంశంపై ఆయన ఆసుపత్రి సిబ్బందికి వివరించారు. అదేవిధంగా హాస్పటల్స్, ల్యాబ్ నుండి ఉత్పత్తి అయ్యే బయోమెడికల్ వ్యర్థాలను ఏ విధంగా వేరు చేయాలనే విషయాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభా శంకర్ హాస్పటల్ చైర్మెన్ జి.ఎస్.శంకర్ రావు, హాస్పటల్ స్టాఫ్, నర్స్, వార్డ్ బార్సు పాల్గొన్నారు.