Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
నవతెలంగాణ-ములకలపల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఆదివారం సీతాయిగూడెం గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ కారం సుదీర్ ఏర్పాటు చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందిం చారు. కొద్ది సేపు వాలీబాల్ కోర్టులో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్యతో కలసి వాలీబాల్ ఆడి అందర్ని ఉత్సాహపరిచారు. అనతంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. చాలా రోజులు తరువా త మండలానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతానికి తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయం లోనే మారుమూల గ్రామాలకు రహదారులు విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగుతున్నాయని ఈ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు.
సమన్వయంతో పనిచేయాలని సూచించిన తుమ్మల
గతంలో టీడీపీలో ఉన్న మెచ్చ నాగేశ్వరావు టీఆర్ఎస్లోకి వచ్చినందున పార్టీ కార్యకర్తలు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు. జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య, మెచ్చా నాగేశ్వ రావును ఉద్దేశించి మండలానికి ఏ కార్యక్రమానికి వ చ్చినా ఇద్దరూ ఒకరికి ఒకరు సమాచారం అందించు కొని కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా కోరారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో విలీనం : మెచ్చ
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీ సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసినట్టు స్థానిక శాసన సభ్యులు మెచ్చ నాగేశ్వరావు అన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళానన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసేందుకు హామీ లభించిందని, దీనితోనే టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట టీఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ, ములకలపల్లి, దమ్మపేట జెడ్పీటీసీలు మట్ల నాగమణి, పైడి వెంకటేశ్వరరావు, స్థానిక ఎంపీపీ మట్ల నాగమణి, టీఆర్ఎస్ అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, నాయకులు తాండ్ర బుచ్చిబాబు, ఇంనుగంటి రాము, పామర్తి వెంకటేశ్వరరావు, బాలప్పారావు, ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.