Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్న స్థలంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లివ్వాలి
నవతెలంగాణ-జూలూరుపాడు
అర్హులైన పేదలకు కరోనా ప్యాకేజీ కింద రూ.1500, పది కేజీ బియ్యం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య అన్నారు. ఆదివారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో గార్లపాటి వెంకటి ఆధ్యర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాసాని, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్యలు మాట్లాడారు. గతంలో ఇచ్చినట్లుగా ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.1500, పది కేజీల బియ్యం కరోనా ఉన్నంతకాలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా రెండో దశలో భాగంగా ప్రజలకు వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సంవత్సరాల కింద చెప్పి నట్లుగా 57 యేండ్లు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్ రూ.3000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థలం చూపెట్టిన చోట పేదలకు డబల్ బెడ్ రూమ్ కట్టించి ఇవ్వాలని ఆరోపిం చారు. మానిఫెస్టో అనడమే కాదు చేసి చూపించండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యా యులకు రూ.2 వేలు ఎటూ సరిపోవని అన్నారు. కనీసం రూ.10 వేలు ఇవ్వాల న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చీమలపాటి భిక్షం, బానోతు ధర్మ, వెంకటేశ్వర్లు, బానోతు మధు తదితరులు పాల్గొన్నారు.