Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
కుల వివక్ష, పీడన, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే మహాత్మా జ్యోతి రావు పూలేకు ఇచ్చే ఘనమైన నివాళి అని కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మహాత్మ జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతి సభ నిర్వహించారు. పూలే జయంతి సభలో మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక న్యాయం, దోపిడి, పీడనకు వ్యతిరేకంగా సబ్బండ వర్ణాలు పోరాటం చేయడమే జ్యోతిరావు పూలే ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. కేంద్రంలో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతలు కరువయ్యాయి అన్నారు. కుల వివక్ష వ్యతిరేకంగా పూలే తన జీవితాన్ని త్యాగం చేసాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామాజిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లిలో : జ్యోతిరావు ఫూలే 195వ జయంతి లక్ష్మీదేవిపల్లి మండలం పెద్దతండ గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, తెలంగాణ రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో జాటోత్ కృష్ణ, నలమల్ల సత్యనారాయణ, యు.నాగేశ్వరావు, వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.