Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలోని ఎంజి రోడ్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కూడళ్ళను మూసివేస్తూ డివైడర్ల నిర్మాణం చేపట్టడం సరికాదని, ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు, పాదచారులకు సౌకర్యంగా ఉన్న కూడళ్ళను యథాతథంగా ఉంచి డివైడర్ల నిర్మాణం చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంజి రోడ్డులో చేపడుతున్న డైవైడర్ల నిర్మాణం పనులను పలు రాజకీయపార్టీలు, వ్యాపారులు, ప్రజాసంఘాలతో కలిసి ఆదివారం పరిశీలించారు. కూడళ్ళను మూసివేస్తూ చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ ఎంజి రోడ్డులో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 'కూనంనేని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, నాయకులు మాచర్ల శ్రీనివాస్, పిడుగు శ్రీనివాస్, బిఎస్పీ జిల్లా నాయకులు ఎర్రా కామేష్ వివిధ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు మూసేస్తే ప్రతిఘటన తప్పదు : బీఎస్పీ కామేష్
ప్రధాన రహదారి నుండి రైతు బజార్‌కు వెళ్ళే రహదారి మూసేస్తే ప్రతిఘటన తప్పదని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, అసెంబ్లీ కన్వీనర్. బొంతు సత్యకిరణ్, గంధం మల్లికార్జున్, గుడివాడ రాజేందర్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.