Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మధిర శివాలయం వద్ద వైరా నదిపై కాజ్వే నిర్మాణం వెంటనే చేపట్టాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, మధిర అర్బన్ ,రూరల్ టీడీపీ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పార్టీ శ్రేణుల ధర్నా నిర్వహించారు. వైరా నదిపై, మధిర, మడుపల్లి ప్రజల రాకపోకల సౌకర్యార్థం మధిర శివాలయం వద్ద రూ.28 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదిత ''కాజ్ వే కమ్ చెక్ డ్యాం'' నిర్మాణం ఒకేసారి చేపట్టాలని నిర్మాణ ప్రదేశంలో ఉన్న ఐబీ డీఈ, ఏఈలను డిమాండ్ చేసి ధర్నా చేయటం జరిగినది. ప్రస్తుతం కేవలం చెక్ డ్యాం నిర్మాణ పనులు మాత్రమే చేస్తున్నారని అవీ లోపభూయిష్టంగా ఉన్నాయని సొంత ప్లాన్ ప్రకారం నిర్మాణం చేపట్టారని ఎన్నికల హామీ ప్రకారం రూపొందించిన ఒరిజినల్ ప్లాన్‌లోని కాజ్ వే అంశంను కావాలని విస్మరించారు.