Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మనువాదంపై పోరాడి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎన్నెస్పీ క్యాంప్ లోని సంఘం జిల్లా కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం జిల్లా నాయకులు గంటా భీమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ పరిరక్షణకు జరుగుతున్న పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్రల సందర్భంగా సోమవారం ఉదయం10 గంటలకు ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి నీల్ దండు కవాత్ ను నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమంలో సంఘ కార్యకర్తలు, సామాజిక, ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పాపిట్ల సత్యనారాయణ, కుక్కల సైదులు, బుర్రి వెంకటకుమార్, వీరభద్రం, రైతు సంఘం నాయకులు ఎస్ కె. మీరా, భూక్య కృష్ణ, ఎల్.గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.