Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా ఇండోర్ స్టేడియం లో ఈ నెల 9 నుండి 11 వరకు జరిగిన రెండు రాష్ట్రాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిసినవి. రాయల మీనాకుమారి మెమోరియల్ ఆధ్వర్యం లో జరిగిన మెయిన్స్ షటిల్ పోటీలలో ప్రథమ, బహుమతిని గుంటూరు కు చెందిన పవన్,ఖాదర్,లు 25016/- రూపాయల నగదు,షీల్డ్ గెల్చుకున్నారు.ద్వితీయ బహుమతి ని హైదరాబాద్ కు చెందిన ముజీఫ్, రాహుల్ 20016/- రూపాయలు, షీల్డ్ ,తతీయ బహుమతి విజయవాడకు చెందిన అనిల్, సైదా లు 15016/- రూపాయలు ,షీల్డ్ ,చతుర్ధ బహుమతి ని నరసరావుపేట కు చెందిన జితేందర్, మహి లు 10016/- రూపాయలు షీల్డ్, గెల్చుకున్నారు. వీరికి మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ బహుమతులను ప్రదానం చేశారు.కార్యక్రమం లో లయన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్ డాక్టర్ కాపా మురళీ కృష్ణ,చావా కుమార్,పోటు మధు,షేక్ గని,షేక్ అంజాద్, రేమళ్ళ సురేష్, పెద్దప్రోలు నవీన్,రాయల కరుణాకర్,తదితరులు పాల్గొన్నారు.