Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రమాదాలు, అనారోగ్యాల పాలైన పేద వర్గాలకు చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నహస్తం అందిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 41 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన సాయాన్ని నేరుగా ఆయా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు అందించారు. దీంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 21 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల తో పాటుగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో 41 మంది నూతన వధూవరులకు పట్టు చీరలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేశ్, వైస్ చైర్మన్ తోట సుజలారాణి, కమిషనర్ కోడూరు సుజాత నాయకులు గాదె సత్యనారాయణ, వల్లభనేని పవన్, ఎండీ అబ్దులా, నడ్డి ఆనందరావు, కౌన్సిలర్లు చాంద్ పాషా, మట్టా ప్రసాద్, దేవరపల్లి ప్రవీణ్ కుమార్,ఎండీ అనీష్, మారుతి సూరిబాబు పాల్గొన్నారు.