Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1926 పిభ్రవరి 10వ తేదీన వీఆర్పురం మండలం అడివి వెంకన్నగూడెం గ్రామంలో నిరుపేద ఆదివాసీ కుటుంబంలో కుంజా జోగయ్య, లచ్చమ్మ దంపతులకు 7వ సంతానంగా (బొజ్జికి ఐదుగురు అన్నలు, ఒకఅక్క) కామ్రేడ్ కుంజా బొజ్జి జన్మించారు. పసువుల కాపారిగా వున్న బొజ్జిని కమ్యూనిస్టు ఉధ్యమం ప్రజానాయకుడిగా మార్చింది. 1948-1950 మద్యకాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటదళాలు వీఆర్పురం ప్రాంతానికి రక్షణ కోసం ప్రవేశించాయి. కామ్రేడ్ బొజ్జికి ఆ దళాలతో పరిచయం ఏర్పడింది. దళాలకు కొరియర్గా బొజ్జి పని చేయటం ప్రారంభించారు. అదే పరిచయం ఆయనను కమ్యూనిస్టు ఉద్యమం వైపు నడిపింది. ఆ కాలంలో గిరిజన గ్రామాలలో పారెస్టు వెట్టిచాకిరి, మేకలపుల్లరి తీవ్రంగా వుంది. విద్యా, వైద్యం అభివృద్ధి అనేది ప్రజలకు అందుబాటులో లేదు. అటువంటి సమయంలో గిరిజన గ్రామాలలో కమ్యూని స్టుల ప్రవేశం ప్రజలజీవితాలలో కొత్తవెలుగులు నింపిందని చెప్పవచ్చు. 1951-1952 ప్రాంతంలో ఏర్పాటైన మొదటి కమ్యూనిస్టు శాఖలో సభ్యునిగా ఆయన ప్రజా జీవితం ప్రారంభమై 2021 ఏప్రిల్ 12 వరకు సాగింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మేకలపుల్లరి, పారెస్టు దోపిడి, తునికాకు కట్టరేట్లు పెంపు, భూముల రీసర్వే, భూపంపిణీ, సాగుభూ ములపై హక్కులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లపై పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాలలో బొజ్జి అత్యంత క్రీయశీలకంగా వ్యవహరించారు. సాయుద దళాలు అందించిన పెద్ద బాలశిక్ష పుస్తకం ద్వారా చదువు నేర్చుకున్నారు. చదివింది పెద్దబాలశిక్ష అయినప్పటికీ జ్ఞాపకశక్తి అపారమైనది. 95 సంవత్సరాల వయస్సులోనూ అనేక పోరాట ఘటనలు తేదీ సమయం వంటి విషయాలు మర్చిపోకుండా గుర్తు పెట్టుకున్నారు. ప్రజా ఉద్యమాలలో చురుకుగా వ్యవహరిస్తున్న బొజ్జి. కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణ పట్ల కమ్యూనిస్టు ఉధ్యమంలో వచ్చిన చీలికల నేపద్యంలో 1964లో కుంజా బొజ్జి సీపీఐ(ఎం) వైపు నిలబడి తుదిశ్వాస విడిచేవరకు, సీపీఐ(ఎం) లోనే కొనసాగారు. భూముల రీసర్వే కోసం, భూ హక్కుల కోసం ధర్నా చేస్తుంటే ప్రభుత్వం లాఠిచార్జిచేసి తలపగలగొట్టారు. అయినా సరే పట్టువీడక పోరాటం చేయటంతో భూములు సర్వే చేసి హక్కులు కల్పించారు. పార్టీలో నాయకుడిగా ఎదుగుతూ, అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న సీపీఐ (ఎం)ను దెబ్బతీయటం కోసం అనాటి పిపుల్స్ వార్ మావోయిస్టులు బొజ్జి ఇంటికి వచ్చి 1983లో పార్టీకి రాజీనామ చేయాలని, లేదంటే చంపుతామని బెదించా రు. నేను మాములుగా చనపోతే నాకోసం 10 జెండాలు ఎగురుతాయి. ఈ నియోజకవర్గంలో 10వేల సీపీఐ(ఎం) జెండాలు ఎగురుతాయి. కాబట్టి నన్ను చంపితే మా పార్టీకి లాభామే గాని నష్టంలేదని మావోయిస్టులతో సవాల్ చేసిన నాయకుడు బొజ్జి. టీవీఆర్ చంద్రం, బండారు చందర్రావు, బొప్పెన బీమ య్య, యలమంచి, సీతారామయ్య, బత్తుల భీష్మారావు, మయ్య, బీఎస్ రామయ్య, ఇర్పాశ్రీరా ములు, మార్తా శ్రీరాంమూర్తి, శ్యామల వెంకటరెడ్డి, చింతూరి వెంకట్రా వు, ఉయికపాపరావు వంటి ఉత్తమ నాయకులతో కలిసి భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి అశేష కృషి చేశారు. ఒకవైపు సీపీఐ(ఎం) ప్రజాపోరాటాలు, మరోవైపు ప్రజాప్రతినిధుల కృషి కలిసి ఈ ప్రాంత అభివృద్ధి ముందుకు సాగింది. 1980లోనే మారుమూ ల గిరిజన గ్రామాలకు విధ్యుత్, విద్యా, రహదారులు, వైద్యసేవల కోసం హాస్పటల్స్ ఏర్పాటుకు గట్టి కృషి ప్రారంభమైంది. ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుం టూ పోరాటంలో అగ్రభాగంలో నడుస్తున్న బొజ్జిని సీపీఐ(ఎం) 1985లో ఎమ్మెల్యేగా పోటిలో దింపింది. కాంగ్రేస్ అభ్యర్ధి సోడిభద్రయ్యను ఓడించి 1985 మార్చి 5న మొదటిసారిగా ఎమ్మెల్యే గా గెలుపొందా రు. అలావరుసగా 1989, 1994 మూడుసార్ల గెలుపొంది 1999వరకు ఎమ్మెల్యేగానే కొనసాగారు. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు బొజ్జి. 1985 నవంబర్ 5వ తేదీన మామూలగిరిజన గ్రామ మైన జీడిగుప్పుకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు బండారు చందర్రావు, బీష్మారావు, సున్నం రాజయ్యతో కలిసి ఎమ్మెల్యేగా వున్న బొజ్జి జీడిగుప్ప వెళ్ళివస్తుంటే. పిపుల్స్ వార్ మావోయిస్టులు దాడిచేసి చందర్రావు, భీష్మారావులను హత్యచేశారు. బొజ్జి, రాజయ్యని తీవ్రంగా కొట్టారు. ఆ దాడిలో బొజ్జి చెవి వినికిడి కొల్పో యారు. అలా అనేకర కాల దాడులు, బెదిరిపులను నిర్భందాలను ఎదిరించి ప్రజాసేవకు అంకితమైన ఆదర్శనాయకుడు బొజ్జి. ఎమ్మెల్యేగా శాశన సభలో ప్రజలవాణి వినిపించారు. చలోక్తులతో అత్యంత సరలమైన భాషతో ప్రజల సమస్యలను ప్రస్తావించే వారు. నియోజకవర్గమేకాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుండి శ్రీకాకులం వరకు ఎక్కడ గిరిజను లు, పేదలు, కార్మికుల పోరాటాలు జరిగానా పార్టీ ఆదేశం మేరకు అక్కడకు వెళ్ళి పోరాటంలో పాల్గొన టం, ఆ ప్రజల సమస్యలను శాశనసభలో ప్రస్తావన చేయటం ద్వారా పరిష్కారానికి కృషి చేశారు. భద్రాచలంలో 2వ వాటర్ ట్యాంక్ నిర్మాణం, కరకట్ట నిర్మాణం, 100పడకల హాస్పటల్, అత్యంత మారు మూల గ్రామాలలో సైతం పాఠశాలలు ఏర్పాటు చేయించారు. తద్వార గిరిజన, గిరిజనేతర ప్రజల విద్యాభివృద్ధికి తొడ్పటునంది ంచారు. సాగునీటి వనరుల సద్వినియోగం కోసం కృషి చేశారు. పాల్వం చలో వున్న ఐటీడీఏని భద్రాచలం మార్పించటం ద్వారా గిరిజనుల చెంతకు పరిపాలనను, సంక్షేమాన్ని చేర్చా రు.1993ప్రాంతంలో గిరుజనేతర పేదలు ప్రజలు సాగుచేస్తున్న భూములు గుంజుకునేందు పాలకులు ప్రయత్నిస్తే అడ్డుతిరిగి ప్రజలపక్షంవైపు నిలిచారు. 1976 నుండి 2000సంవత్సరం వరకు వ్యవసాయ కూలి పోరాటలకు నాయకత్వం వహిం చారు. వర్గ పోరాటల నిర్వహానలో కీలకంగా పనిచేశా రు. నిరంతరం ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబా టులో వుంటూ...మచ్చలేని ప్రజాజీవితాన్ని అనుభవి ంచారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే కోట్లు కూడబెట్టుకునే ఈరోజులలో 3సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా... ఎటువంటి ఆస్తులు పోగుచేసుకోని నిజాయితీ పరుడు బొజ్జి. తనను డబ్బు, పదవులతో కొనుగోలు చేయాలని చూసిన బూర్జువాపార్టీల నేతలకు ఏనాడు తలవంచలేదు. పదవులు, డబ్బు నా పార్టీ సభ్యత్వం ముందు ఎందుకు పనికిరావని సమాదానం ఇచ్చాడు. డబ్బు, పదవులు నా కాలిగోటితో సమానమని, నన్ను, నా పార్టీ సభ్యత్వాని కొనేశక్తి ఏవడికీ లేదని స్పష్టంచేశారు. పార్టీ సభ్యత్వం విలవను గుర్తు చేశారు. తనజీవితంలో అడుగడుగునా సీపీఐ(ఎం) ఆదర్శలను నింపుకుని ఏజన్సీ సుందరయ్యగా నిలిచారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. తాను అత్యంత ఇష్టంగా ఆదర్శంగా భావించే పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను, ఆదర్శాను కడవరకు కొనసాగించారు. తాను మరనించటానికి కొన్నిగంటల ముందువరకు పార్టీ గురించి పార్టీచేసే పోరాటాల గురించి తెలుసుకు నేవారు. హాస్పటల్లో తనని పరామర్శిం చేందుకు వెళ్ళిన నాయకులను కెరళ, బెంగాల్ ఎన్నికల గురించి, జాతీయ, అంతర్జాతీయ రాష్ట్ర రాజకీయల గురించి ఆశక్తిగా అడిగి తెలుసుకునేవారు. ప్రజలను దోపిడి నుండి విముక్తిచేసి, ప్రజలకు సమానత్వాన్ని ఇచ్చేది సోషలిజం ఒక్కటేనని నమ్మిన మహానీయుడు బొజ్జి. తానునమ్మిన ఎర్రజెండాకి, సీపీఐ(ఎం) విప్లవ రాజకీయాలకు వన్నెతెచ్చిన బొజ్జికి విప్లవజోహార్లు. ప్రజలను సంఘటితంచేసి పార్టీకి పూర్వవైభవం తేవటంమే ఆయన మనమిచ్చేనివాళి.
- కె బ్రహ్మాచారి
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు