Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
సీనియర్ నాయకులు, ఏజెన్సీ సుందరయ్యగా పేరొందిన కుంజా బొజ్జి (95) ఇక లేరని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సిహెచ్ మురళీకృష్ణ అన్నారు. ోమవారం బొజ్జి పార్థివదేహాన్ని సందర్శించి, ఘన నివాళిి అర్పించి ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో నిరుపేద గిరిజన, గిరిజనేతరుల సమస్యల పరిష్కారం కోసం, తునికాకు కార్మికుల కూలీ ధరల పెంపు కోసం బొజ్జి పలు ప్రజా ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేసిన కుంజా బొజ్జిని ఏజెన్సీ సుందరయ్యగా పలువురు పిలుస్తారన్నారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. బొజ్జి 1989- 94లలో సైతం విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారన్నారు. మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ప్రజల కోసం పనిచేశారన్నారు.
కుంజా బొజ్జి ప్రజా నాయకుడిగా ప్రజల మధ్య ఉండటం ఇష్టంలేని శక్తులు ఆయనపై అనేకమార్లు హత్యాయత్నం చేశారని, వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డ ప్రజానేత కుంజా బొజ్జి, బండారు చందరరావు, బత్తుల భీష్మారావు, మాజీ శాసన సభ్యులు సున్నం రాజయ్య వంటి నేతలతో ప్రయాణించే సమయంలో వీరిపై దాడులు జరిగాయని, ఆ దాడుల్లో బండారు చందరరావు, బత్తుల భీష్మారావులను సీపీఐ(ఎం)ను కోల్పోవలసి వచ్చిందన్నారు. ఆయన తరువాత భద్రాచలం నుంచి సున్నం రాజయ్య కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని మోరళీ తెలిపారు.