Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
పాల్వంచ: అసలే కరోనా ఎఫెక్ట్... ఆపైన ఆన్లైన్ క్లాసులు.. ధనార్జనే ధ్యేయంగా పాల్వంచ నవభారత్ పాఠశాల యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరు పట్ల పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేస్తుంది. ఆన్ లైన్ క్లాసు విన్న ప్రతి విద్యార్థి మొత్తం ఫీజు చెల్లించాలని నవభారత్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సెల్ ఫోన్లో మెసేజ్‌లు పంపించారు. మెసేజ్‌లు చూసి ఒక్క సారిగా అవాక్కయిన తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్‌ని సంప్రదించగా ఆన్లైన్ క్లాస్ విన్నా... వినకున్నా మొత్తం ఫీజు చెల్లించాల్సిందేనని, ఫీజు చెల్లించని వారిని ఆన్లైన్ క్లాస్ వాట్సాప్ గ్రూప్‌లో నుండి తొలగించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ మొండి వైఖరిని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి పాఠశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ తరఫున బొందిలి హరి, సర్వేశ్, వాజీద్, ముంతాజ్ అలీ, హరీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.