Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపాటి మనోహర్
- ఖమ్మంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో నీల్ దండు కవాత్
నవతెలంగాణ-ఖమ్మం
రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ పరిరక్షణకై పూలే అంబేద్కర్ ల స్ఫూర్తితో ఉద్యమించాలని, మతో న్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందామని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రలో బాగంగా ఖమ్మంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో సోమవారం న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి మయూరి సెంటర్, వైరా రోడ్డు మీదుగా జిల్లా పరిషత్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు బ్లూ టి షర్ట్స్ ధరించి నీల్ కవాత్ ను నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో మనోహర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొలగించి మనువాదాన్ని తెచ్చేందుకు కేంద్రం తహ తహలాడుతున్నదని, రిజర్వేషన్లు తొలగించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులైన అంబానీ, ఆధానీలకు కారుచౌకగా కట్టబెట్టి రాజ్యాంగ మౌళిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గంటా భీమయ్య, కొమ్ము శ్రీను, పాపిట్ల సత్యనారాయణ, పగిడికత్తుల నాగేశ్వరరావు, కుక్కల గురుమూర్తి, పొట్టపింజర నాగులు, కుక్కల సైదులు, సాయి, పుల్లారావు, వరకుమార్, గంట సుజాత, బీబీ, జీజుల సరోజ, వెంకటమ్మ, ఎస్.బాలరాజు పాల్గొన్నారు.