Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
మండల పరిధిలోని కుర్నాపల్లి, బూర్గుపాడు అటవీ ప్రాంతంలో నలుగురు మిలిషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేసినట్టు సీఐ బి.అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారి వివరాల ప్రకారం... కుర్నాపల్లి బూర్గుపాడు అటవీ ప్రాంతంలో మిలీషియా సభ్యులు సంచరిస్తున్నారని సమాచారం రాగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్ల పోలీసు, 141 (ఏ) సీఆర్పీఎఫ్ కంపెనీ, స్పెషల్ పోలీసు సిబ్బంది కలిసి కుర్నాపల్లి బూరుగుపాడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉందయం కొంతమంది మిలిషియా సభ్యులు కుర్నాపల్లి బూర్గుపాడు దండకారణ్య ప్రాంతంలో ఉన్న మార్గంలో మందుపాతర అమర్చుతూ, పోలీసులను చూసి వారు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి, పట్టుకున్నారు. విచారించగా వారి పేర్లు ఛత్తీస్గడ్ భాసగూడెం ఏరియా కొండపల్లి నివాసి కుంజం సన్న, ఏ.రమేశ్ తండ్రి జోగ, చర్ల మండలం వీరాపురంకి చెందిన సోడి పోజ్జే తండ్రి ఇడుమయ్య, బూర్గుపాడు గ్రామంకు చెందిన వెట్టి ఐతఏ చందు తండ్రి గంగా, కొర్కటుపాడు గ్రామంకు చెందిన మడివి రాజే తండ్రి ఉంగ వీరు అని తెలిపారు. ఈ నలుగురు గత కొంత కాలంనుండి నిషేదిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి మిలిషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. సోమవారం ఎర్రపాడు గ్రామానికి చెందిన చర్ల ఏరియా మిలిషియా కమాండర్ బాలు ఇతర మిలిషియా సభ్యులతో కలిసి కుర్నాపల్లి బూర్గుపాడు అటవీ ప్రాంతంలో నిషేదిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు అయిన భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి కార్యదర్శి ఆజాద్, చర్ల-శబరి ఏరియా డిసీఎం శారద, చర్ల శబరి ఏరియా కార్యదర్శి అరుణ, ఎల్జీఎస్ చర్ల ఏరియా కమాండర్ మధుల ఆదేశాలతో పోలీసు వారిని చంపాలనే ఉద్దేశంతో వారు ఈ మందుపాతర అమర్చటానికి వచ్చారని సీఐ వివరించారు. వీరి వద్ద నుండి టిఫిన్ బాక్స్, జెలాటిన్ స్టిక్స్-10, డిటోనేటర్-1, కార్డేక్స్ వైర్ -25 మీటర్స్, బాటరీ సెల్స్-4లను స్వాధీనపరుచుకున్నట్లు వీరు గతంలో ఉన్న మిలిషియా కమాండర్ సోడి జోగయ్య నేతృత్వంలో సెప్టెంబర్ నెల 2020లో తేగాడ కలివేరు మద్యలో గల రోడ్డు పక్కన మందుపాతర అమర్చిన సంగటనలో కూడా పాల్గొన్నారన్నారు. వీరిపై చర్ల పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ 141 (ఏ) కంపెనీ ఎసిస్స్టెంట్ కమండెంట్ సుభీర్ కుమార్ మండల్, చర్ల ఎస్ఐ రాజు వర్మ పాల్గొన్నారు.