Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు స్టేషన్కు తరలింపు
నవతెలంగాణ-అశ్వాపురం
గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో నిల్వచేసిన గంజాయిని సోమవారం అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామంలో దాసరి రాము అనే వ్యక్తి ఇంట్లో గంజాయి నిల్వఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడిచేసారు. ఈ దాడిలో అతని ఇంట్లో 2.99 కేజీల గంజాయి పట్టుబడింది. సంఘటన స్థలాన్ని మణుగూరు ఎఎస్పీ శబరీష్ పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలు సుమారు రూ.44.85 లక్షలు ఉంటుందని తెలిపారు. అశ్వాపురం సీఐ చేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో ఎస్సై విఎన్ రావు, మంగిలాల్, భద్రు పాల్గొన్నారు.