Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
పేదలకు దక్కాల్సిన డబల్ ఇండ్లకు నాయకుల ముసుగులో కేటుగాళ్లు డబ్బులు వసూల్ చేస్తున్న ఘటన గిద్దవారిగూడెంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దవారిగూడెంలో డబల్ ఇండ్లకు అర్హులుగా రెవిన్యూ అధికారులు 21 మందిని గుర్తించారు. గ్రామంలో 16 డబల్ ఇండ్లను మాత్రమే నిర్మాణం చేయటంతో 16 మందికి లాటరీ ద్వారా ఇండ్ల కేటాయించారు. తర్వాత మరో 8 డబల్ ఇండ్ల నిర్మాణం జరగగా దాని కేటాయింపులో డబ్బుల డిమాండ్ చోటుచేసుకుంది. కొందరు నాయకులు రంగంలోకి దిగి గతంలో అర్హులుగా గుర్తించిన వారిలో నల్గురికి మరో నల్గురు కొత్తవారికి ఇళ్లు కేటాయించే విధంగా గ్రామస్తులు నిర్ణయించు కున్నారు. ఈక్రమంలో ఈ ఎనిమిది మంది నుండి ఇంటికి రూ.25వేలు చొప్పున ఇవ్వాలంటూ కొందరు నేతలు లబ్ధిదారులను డిమాండ్ చేయటంతో విషయం బయటకు పొక్కింది.
వాయిదా పడ్డా గ్రామసభ
డబల్ ఇండ్లకు డబ్బుల్ వసూల్ చేసిన విషయం స్ధానిక మండల నాయకుల ద్వారా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ తెలిసింది. దీంతో డబ్బులు వసూలు చేసిన విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇండ్ల కేటాయింపు గ్రామసభను వాయిదా వేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం
మోసగాళ్ల మాటలు నమ్మొద్దు - తహసీల్ధార్
మండలం కొందరు మోసగాళ్లు డబల్బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ పైకం వసూళు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కారేపల్లి తహసీల్ధార్ డీ.పుల్లయ్య తెలిపారు. డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుందని ప్రజలు మోసగాళ్ల మాటలు నమ్మవద్దని కోరారు. డబుల్ ఇండ్ల ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడితే అట్టి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.