Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని సిద్ధిక్ నగర్ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గొల్లమందల పెద్ద వెంకటేశ్వర్లు ( 75) గుండెపోటుతో సోమవారం ఉదయం మృతిచెందారు. పెద్ద వెంకటేశ్వర్లు 1979 నుంచి 1985 వరకు సిపిఎం నుంచి సిద్ధిక్ నగర్ పాతలాలాపురం గ్రామాలు కలిసి ఉన్నప్పుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పేదప్రజలకోసం నిజాయితీగా పనిచేశారు. భూ పోరాటాలు కూలీ పోరాటాలతోపాటు వ్యవసాయ కార్మికుల సమస్యలపై పార్టీ ఇచ్చిన పిలుపులో చురుకుగా పాల్గొన్నారు. మృతునికి భార్య, ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారు. దాదాపు కుటుంబ సభ్యులందరూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు భూక్యా వీరభద్రం, బండి రమేష్, మాచర్ల భారతి, రాష్ట్ర కమిటీ సభ్యులు యం.సుబ్బారావు, పి.సోమయ్య, కొణిజర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావు, సింగరాయపాలెం లాలాపురం నాయకులు దొడ్డపనేని కృష్ణార్జున్‌రావు, రోషన్ బేగ్, మిద్దె రామారావు, సొసైటీ డైరెక్టర్ సంక్రాంతి నర్సయ్య, తీగల వెంకటి, యరమల మాదవరెడ్ది, కాటయ్య, జయ, టీఆర్ఎస్ నాయకులు నంభూరి సుధాకర్, షేక్ నాగుల్ మీరా, ప్రముఖ న్యాయవాదులు మందలపు శ్రీను, చింతనిప్పు వెంకట్ పాల్గొన్నారు.