Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కుంజా బొజ్జి మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్ లో సోమవారం కుంజా బొజ్జి సంతాప సభ సిపిఎం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సీపీఎం మండల నాయకుడు ఊరడి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో తుమ్మల శ్రీనివాసరావు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గం నుంచి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిరాడంబరమైన జీవితం గడిపిన మహౌన్నత వ్యక్తి కుంజా బొజ్జి అన్నారు. నేటి యువత కుంజా బుజ్జిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సమావేశంలో మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్‌రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పొన్నెకంటి సంగయ్య, నాయకులు బందెల వెంకయ్య, ఏదులాపురం సొసైటీ మాజీ ఛైర్మన్ మంకెన నాగేశ్వరరావు, సుడా డైరెక్టర్ గూడ సంజీవ రెడ్డి, రైతు సంఘం నాయకులు నాయకులు తోట పెద్ద వెంకట రెడ్డి, సీపీఎం నాయకులు అచ్చయ్య, రాఘవులు, గోగుల నాగరాజు, వెంకటేశ్వర్లు, శ్రీను, వెంకన్న, నాగేశ్వరరావు, బ్రహ్మచారి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
మధిర : భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు పనిచేసి అనారోగ్యంతో మరణించిన కామ్రేడ్ కుంజా బొజ్జికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు మధిర సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి శ్రీలం నర్సింహారావు, టౌన్ కమిటీ సభ్యులు పడకంటి మురళి తేలప్రోలు రాధాకృష్ణ, మండవ కృష్ణారావు, అనుమోలు భాస్కస్రావు, ఆవుల శ్రీనివాస్‌రావు, మండవ ఫణీంద్ర కుమారి, కిషోర్, వాసిరెడ్డి సుందరయ్య ఎలమంద తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం పోరాడారని, నీతి నిజాయితీగా ఉంటూ మన్యం ఎమ్మెల్యేగా పేరు సంపాధించుకున్నారని తెలిపారు.
సత్తుపల్లి : కుంజా బొజ్జా మరణం గిరిజనులకు తీరనిలోటని సత్తుపల్లి సీపీఐ (ఎం) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు జాజిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సంతాపసభలో నాయకులు మాట్లాడుతూ 3 పర్యాయాలు భద్రాచలం శాసనసభ్యులుగా కుంజా బొజ్జా గిరిజన, కార్మికుల పక్షాన అలుపెరుగని పోరాటం చేశారన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని కొనియాడారు. నమ్మిన సిధ్ధాంతం కోసం తుదిశ్వాస వరకూ పోరాడిన కుంజా బొజ్జా అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మోరంపూడి పుల్లారావు, మోరంపూడి పాండురంగారావు, రావుల రాజబాబు, తెగుళ్ల లకీë, మీసాల వెంకట్రావ్, చావా రమేష్, మండూరి రవి, బడేమియా, ఎస్కే వలీ, వెంకటేశ్వరరావు, రావుల కవిత, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.