Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభానికి నోచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రం
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో అకాల వర్షం కురవడంతో సోమవారం రైతులు పరుగులు తీసారు. గ్రామంలో సుమారు 40 మంది రైతులు 150 ఎకరాల్లో వరి పంట కోసి ధాన్యాన్ని అరబెట్టిన అకాల వర్షంతో నల్ల పట్టాలు దొరకక అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక్క రాజాపురంలో కాక అనేక గ్రామాల్లో రైతులు వరి పంట కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పండించిన పంట ప్రతి గింజా కొంటామని చెప్పిన అవి మండలంలో మాటలకే పరిమితం అయ్యాయని రైతులు వాపోతున్నారు. మండలంలో పది పంచాయతీల్లో సుమారు 2800 ఎకరాల్లో వరి పంట వేసి కోతలు కోపిస్తున్నా....ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఆలస్యం కావడంతో కొంతమంది రైతులు దళారులును ఆశ్రయించి తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.