Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం ఆదివాసి సమితి కమిటీ
నవతెలంగాణ-భద్రాచలం
ఆదివాసీ సీనియర్ నాయకులు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మరణం ఆదివాసీ జాతికి తీరని లోటు, వారి ఆశయాలను, ఆదర్శలను ముందుకు తీసుకువెళ్తామని భద్రాచలం ఆదివాసీ సమితి అధ్యక్షుడు పునెం కృష్ణ దొర అన్నారు. ఈ సందర్భంగా ఆయన భౌతికఖాయనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొజ్జి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వుండి ప్రజల కోసం పనిచేసి, అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పునెం కృష్ణ దొర, ప్రధాన కార్యదర్శి పాయం రవివర్మ, ఆదివాసీ సీనియర్ నాయకులు, సలహాదారులు మానే రామకృష్ణ, కొండ్రు వీరాస్వామి ,కుంజా ధర్మా , కుంజా శ్రీను తదితరులు పాల్గొన్నారు.