Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజాయి విలువ సుమారు రూ.మూడు లక్షలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో పోలీసులు మంగళవారం అటవీ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వ హించగా అక్రమంగా తరలి స్తున్న గంజాయిని పట్టుకు న్నారు. వారి వివరాల ప్రకారం ... భద్రాచలం పట్టణ సీఐ టి. స్వామి ఆధ్వర్యంలో ఎస్ఐ సెల్వ రాజు, ప్రొబెషనరీ ఎస్ఐ రంజిత్ కుమార్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో యూపీ 17 ఎఫ్ 8059 నెంబర్ గల కారు అనుమానాస్పదంగా వస్తుండగా ఆపి తనిఖీ చేశారు. ఈ వాహనంలో ప్రభుత్వ నిషేధ గంజాయి ఉండటాన్ని గమనించారు. ఆ కారులో 20 కేజీల గంజాయి లభ్యమైంది. పట్టుబడిన గంజాయి రూ.మూడు లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హమీద్ ఖాన్ ఈ గంజాయిని ఒరిస్సా ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ తీసుకెళ్తుండగా పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి, వ్యక్తిని కోర్టుకు రిమాండ్ నిమిత్తం పోలీసులు తరలించారు.