Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
టీఎస్‌యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం టీఎస్ యూటీఎఫ్ 8వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ పతాకాన్ని ఆ సంఘం నాయకులు కె.వరలక్ష్మీ అవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్ మాట్లాడారు. టీఎస్ యూటీఎఫ్ 2014 ఏప్రిల్ 13న అవిర్భవించిందని, ఆనాటి నుండి ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల సాధన కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ జీఓలను విడుదల చేయాలని, పీఆర్సీ అనుబంధ జీఓలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు ఎన్.కృష్ణ, కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు ఇ.హాతిరాం, జి.సక్రాం, ఎం.పద్మారాణి, మండల నాయకులు బి.బిక్కు, సురేష్, డి.దాసు, ఎం.రాజు, శంకర్, బి.బాబులాల్, కె.వరలక్ష్మీ, కళ్యాణి కుమారి, సుశీల, జ్యోస్పిన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.