Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు ఎంఎన్.రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాచలం ఆర్టీసీ డిపో అభివృద్ధికి, ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి కుంజా బొజ్జి ఎంతో తోడ్పాటునందించారని, బొజ్జి మరణ వార్త మనస్తా పానికి గురిచేసిందని టీఎస్ ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు ఎంఎన్.రెడ్డి తెలిపారు. కుంజా బొజ్జి మృతికి ఆయన అశ్రునివాళి అర్పించారు. వారి మృతికి ప్రగాఢ సంతాపం, వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ నివాళులు అర్పిస్తునన్నారు. బొజ్జితో ఆయనకున్న అనుబంధాన్ని తెలిపారు. బొజ్జి భద్రాచలం శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో భద్రా చలం ఆర్టిసీ డిపో అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు.
ఆర్టిసీ మేనేజింగ్ డైరెక్టర్ భద్రాచలం డిపోకు 30 కొత్త బస్సు ఇస్తానని వాగ్దానం చేశారు. బస్సులు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. బస్సులు ఇవ్వలేదని బొజ్జి, నేను కలిసి వెళ్లి మేనేజింగ్ డైరెక్టర్ని కలిసాం. ఆ సందర్భంగా బొజ్జి కొత్త బస్సు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని మేనేజింగ్ డైరెక్టర్ని నిగ్గదీసిన తీరుచూస్తే నాకు ఆశ్చర్యం వేసిందిని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ కంగుతిన్నారు.
ఆ దెబ్బతో ఒక నెల రోజుల్లో భద్రాచలం డిపోకు 30 కొత్త బస్సులు వచ్చాయని గుర్తుచేశారు. బొజ్జి మూడు సార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నా ఎంతో నిడారంబరంగా ఉన్న ఆదర్శ కమ్యూనిస్టు అన్నారు. కానీ, అలాంటి ఆదర్శ కమ్యూనిస్టుల ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడం కమ్యూనిస్టుల కర్తవ్యమన్నారు.