Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమారు రూ.3 కోట్ల విలువ
- ఎప్సీ సునీల్ దత్ వివరాల వెల్లడి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు భారీగా గంజాయి స్వాధీనంం చేసుకున్నట్టు, దీని విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మంగళవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చుంచుపల్లి మండల పరిధిలోని బృందావనం వద్ద చుంచుపల్లి ఎస్.ఐ మహేష్, పోలీసు బృందం ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ-28, డబ్ల్యూ-8974 ఏచర్ వ్యాన్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్టు కనుగొన్నారని తెలిపారు. వాహన డ్రైవర్ షేక్ మహాబూబ్ అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. డ్రైవర్ తెలిపిన విరాలు ప్రకారం ఏపీ రాష్ట్రనికి చెందిన చింతూరు నుండి హైద్రాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిపారు. హైద్రాబాద్, హకీమ్‌పేట, తోలిచౌక్ ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్నట్టు చెప్పారు. వాహనంలో 22 క్వింటాళ్ళ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దాని విలువ సుమారు రూ.3,31,50,000 ఉంటుందని వెల్లడించారు. వ్యాన్‌లో కూరగాయల ట్రేలు ఏర్పాటు చేసి వాటి కింద గంజాయిని ఉంచారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో సీఐ గురుమూర్తి, ఎస్.మహేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.