Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
ఉగాది పండుగ పర్వదినం సందర్భ ంగా మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో ఉగాది వేడుకలను మంగళ వారం సాంప్రదాయబద్దంగా భక్తులు గ్రామ ప్రజలు నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా భక్తులు ముత్యా లమ్మ గుడికి ప్రభలతో వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటారు. కోళ్లను కోసుకునే మొక్కులు తీర్చుకుంటారు. కొంతమంది ప్రభలతో, బోనాలతో వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో అనే ప్రభలతో ముత్యాలమ్మ గుడి వద్దకు డప్పుల వాయిద్యాలతో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెళ్తూనే ఉన్నారు. గొర్రె పొట్టేళ్ళ తో కట్టిన ప్రాబ్లం ప్రజలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. ముత్యాలమ్మ గుడి వద్ద కొద్దిపాటి తిరునాళ్ల సందడి నెలకొని ఉంది పండుగరోజు తీసుకెళ్లినా ప్రభలను ముత్యాలమ్మ గుడి వద్ద వదిలేసి భక్తులు ఇంటికి వస్తారు. మరుసటి రోజు ఉదయం వెళ్లి ఎవరు ప్రభలను వారు ఎడ్లబండ్లతో ఊరేగింపుగా తిరిగి ఇళ్లకు వెళ్తారు.