Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భద్రాచలం శాసనసభ స్థానానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అమరజీవి కుంజా బొజ్జి ఏజన్సీ ప్రాంత మన్యం వీరుడని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య అన్నారు. మంగళవారం మారాయిగూడెం గ్రామంలో సర్పంచ్ తొడెం తిరుపతిరావు అధ్యక్షతన కుంజా బొజ్జి సంతాప సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. పాల్వంచలో ఉన్న ఐటీడీఏ కార్యాలయాన్ని భద్రాచలం తీసుకు వచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ చైర్మన్ సున్నం వెంకటేశ్వర్లు, సోంది ఎడమయ్య, కారం కొమరయ్య, వెంకటేశ్వర్లు, జోగయ్య, రాముడు, జోగారావు, భూపతి, వీరయ్య, ధర్మయ్య, బొజ్జి తదితరులు పాల్గొన్నారు.