Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిగా క్షీరంతో ఎన్టీఆర్ విగ్రహం శుద్ధి
- పార్టీని వదలబోమని పలువురు ప్రతిజ్ఞ
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఇటీవల పార్టీ వీడి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న స్థానికి టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ ముఖ్యులు, పలువురు ఉగాది పర్వదినం పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని మూడు రోడ్ల కూడలిలో గల మహానీయులు విగ్రహాలు సముదాయంలోని టీడీపీ వ్యవస్థాపకుకులు, నందమూరి తారక రామారావు విగ్రహాన్ని క్షీరంతో శుద్ధి చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ... టీడీపీలో బి.ఫాంతో పోటీ చేసి, కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించిన స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఏ పార్టీ తనను ఓడించాలి అని చూసిందో అదే పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోవడం సిగ్గు చేటు అని అన్నారు. టీడీపీ సిద్ధాంతాలను నమ్ముకుని, ఎన్టీఆర్ అభిమానులుగా మేము టీడీపీలోనే ఉంటామని, కార్యకర్తలు, అభిమానులు మా వెంటే ఉన్నారని వారు ప్రకటించారు. రాజకీయాలలో పార్టీలకు వ్యూహాప్రతివ్యూహాలు, ఆటుపోట్లు సహజమేనని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి దొర కత్తం, తుమ్మల నాగేశ్వరరావు, నార్లపార్టీ శ్రీనివాస్, అంకోలు శ్రీనివాసరావు, పేరాయిగూడెం, ఊట్లపల్లి ఎంపీటీసీలు మిండ హరిబాబు, రామకృష్ణ, అశ్వారావుపేట పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.