Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్
నవతెలంగాణ-కొణిజర్ల
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొణిజర్ల సూపర్ జెమ్స్ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు రామారావు చేతుల మీదుగా పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు నెలకు 2000 నగదు, 25 కేజీల బియ్యం ఇచ్చినట్లు గానే, గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన 15000 వేల మంది విద్యా వాలంటీర్లు, ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ డ్రాయింగ్ కోర్సుల కోసం నియమించబడిన పార్ట్ టైం ఇనస్ట్రక్టర్లు 3000 మంది, ప్రైవేట్ లెక్చలర్లు ఉన్నారు. పాఠశాలలు నడవటం లేదనే కారణంతో వీరిని ఈ విద్యా సంవత్సరంలో విధులోకి తీసుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే కొద్ది పాటి గౌరవ వేతనం పైనే ఆధారపడి జీవనం గడుపుతున్న వారి కుటుంబాలు కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నాయన్నారు. కావున వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలన్నారు. అలాగే ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్స్, బదిలీల షెడ్యూలను విడదల చేసి పదోన్నతలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల మండల ప్రధాన కార్యదర్శి జిడిఎస్ వి రమణ, అధ్యక్షుడు బి.తిరుమల ప్రసాద్, కార్యదర్శి యాసా కోటేశ్వరరావు, డీవైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు సాంబశివరావు పాల్గొన్నారు.
మధిర: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక యుటీఎఫ్ డివిజన్ కార్యాలయం వద్ద నిర్వహించారు. యుటిఎఫ్ సీనియర్ సభ్యులు ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన తాళ్లూరి వెంకటేశ్వర్లులి ఉద్యమ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఏ. వినోద్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి టిఆర్ లక్ష్మణరావు మాట్లాడుతూ, 1974 ఆగస్ట్ 10న, అధ్యయనం! అధ్యాపనం!! సామాజిక స్పహ!!! లక్ష్యాలతో ఆవిర్భవించిన యుటిఎఫ్ రాష్ట్ర విభజన అనంతరం ఏప్రిల్ 12న టీఎస్ యుటిఎఫ్ గా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. విద్యా రంగ అభివృద్ధి కోసం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సర్వీస్ సంబంధమైన సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం యుటీఎఫ్ అని ఆయన అన్నారు. ముందు తరం నాయకులు అప్పారి వెంకటస్వామి, మైనేని వెంకటరత్నం, చెన్నుపాటి లక్ష్మయ్య, వి.ఎల్. నరసింహారావు ఆశయాలను ముందుకు తీసుకు వెళుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివధ్ధికోసం కృషి చేస్తూ సంఘ పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధిర ప్రధాన కార్యదర్శి నాగూర్ వలి, ఎర్రుపాలెం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, కోటేశ్వర రావు, సీనియర్ నాయకులు తాళ్లూరి ఆంజనేయులు, బి.వి.రాజేశ్వర రావు, మీరాఖాన్, లాల్ అహ్మద్, వీరయ్య, ఇబ్రహీం, సాధు సమాధానం, కళావతి,హసీనా బేగం,సురేష్ పాల్గొన్నారు.
ఘనంగా యుటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు
కల్లూరు : యూటీఎఫ్ ఎనిమిది వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక సిపిఎస్ ప్రాథమిక పాఠశాలలో యుటిఎఫ్ జెండాను మండల కమిటీ అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు ఆవిష్కరించారు.ఈ సందర్బంగా యుటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాయల నాగేశ్వరరావు కె విజయకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పైన యుటీఎఫ్ చేస్తున్నా పోరాటాన్ని గురించి వివరించారు .ఈ కార్యక్రమంలో ది రాంబాబు, టంగుటూరి రాంబాబు, చావ శ్రీనివాసరావు,వేమూరి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు ,వాసిరెడ్డి పద్మ, తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు : తెలంగాణ ఐక్య ఉపాద్యాయ ఫెడరేషన్ ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవం మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ప్రాథమిక పాఠశాల నందు యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని అధ్యక్షుడు మేకల ధర్మారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.ఈశ్వరాచారి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం ఐక్య పోరాటం చేస్తూ, నిబద్ధత కిలిగి కార్యసాధనలో వెనుకడుగు లేకుండా కృషి చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయల మన్ననలు పొందుతూ ముందుకు పోతున్న ఏకైక సంఘంగా ఉండి యుటి యఫ్ సదరు పోరాటంలో రాజీ పడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమేష్, మహిళా నాయకులు ఎం.సుజాత, కె.నిర్మల కుమారి, నాయకులు జి. చంద్రశేఖర్, టి.రామ శేషు,రామారావు తదితరులు పాల్గొన్నారు.