Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క ఫోన్ కోడితే చాలు ఇట్టే స్పందించే ట్రాన్స్ కో ఏఈ
- కర్షకులు వినియోగదారుల సేవలో ఆయనకు ఆయనే సాటి
- మండల ప్రజల మన్నలనుపొందుతున్నా చల్లా రఘోత్తోమ్ రెడ్డి
నవతెలంగాణ-కొణిజర్ల
ఏదైనా సమస్య తలెత్తి ఊరిలో విద్యుత్‌కి అంతరాయం కలిగి కరెంటు పోతే ఒకోక్కసారి రోజుల తరబడి నిరీక్షణ తప్పేదికాదు. పంట పొలాలకు విద్యుత్ఛ్క్తి అవసరం ఉంది మహప్రభో అని వేడుకున్నా కనుకరించని కరెంటోళ్లని తరచూ చూస్తూనే ఉన్నాం. విద్యుత్ స్తంభాల మార్పిడికి దరఖాస్తులు చేసి సంవత్సరాలు గడిచిన పని పూర్తివని ఉదంతాలు కోకొల్లలుగా కనిపిస్తూనే ఉంటాయి. కరెంటోళ్లు అంటేనే నిర్లక్ష్యానికి నిలువెత్తు అనే అపావదు మోస్తున్న ఈ తరుణంలో ఒక్క ఫోన్ కోడితే ఇట్టేస్పందించే అధికారి దొరకడం సాధారణ విషయమేమికాదు. అచ్చం అలాంటి సామాజిక బాధ్యత వృత్తిపట్ల నిబద్ధత కలిగిన అధికారి మండల విద్యుత్ శాఖ అధికారి దొరకడం ఈమండల ప్రజలు చేసుకున్న సుకృతంగానే భావించాలి. అందరిమన్నలను పొందుతూ అందరివాడుగా నిలుస్తున్నా మండల విద్యుత్ శాఖ అధికారి చల్లా రఘోత్తోమ్ రెడ్డి పై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అయన హన్మకొండలో పదోవతరగతి వరకు చదివి అతర్వాత వరంగల్ లో పాలీటెక్నిక్ పూర్తి చేశారు. అనంతరం 1992 సంవత్సరం ఉద్యోగం వచ్చింది. మొదటిసారిగా తొర్రూర్ మండలంలో సబ్ వర్కర్‌గా ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1997 సంవత్సరంలో కేసముద్రం మండలంలో సబ్ ఇంజనీర్ గా నాలుగు సంవత్సరాలు పనిచేసే అనంతరం ప్రమోషన్ పై నర్సంపేట మండల విద్యుత్ శాఖ (ఏఈ) అధికారిగా 2001 నుంచి 2002 సంవత్సరం కాలం పనిచేసారు. 2003 నుంచి 2008 వరకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విద్యుత్ శాఖ అధికారిగా పనిచేసే రైతులకు వినియోగదారులకు అందుబాటులో ఉంటూ మంచి పేరుగడించారు. అ తర్వత ఖమ్మం రూరల్ మండలంలో 2008నుంచి 2011 వరకు పనిచేసే కొణిజర్ల మండలంలో 2012 నుంచి 2017 వరకు పనిచేసే రైతుల్లో మంచి గుర్తింపు పొందారు. మండలంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమోషన్ పై మూడు సంవత్సరాలు జిల్లా విద్యుత్ స్టోర్ అవుట్ డోర్ కార్యాలయంలో ఏఈగా బాధ్యతలు చేపట్టారు. ఏఈ రఘోత్తోమ్ రెడ్డి స్థానంలో మరో ఏఈ వచ్చిన రైతులు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి ఎమ్మెల్యే కు ఏఈని మార్చాలని రఘోత్తోమ్ రెడ్డినే మరల మండలానికి వచ్చేలా చూడాలని రైతులు కోరడంతో జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి జిల్లా స్టోర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఈ రఘోత్తోమ్ రెడ్డిని 2018లో కొణిజర్ల మండలానికి బదిలీ చేయడంతో రైతులు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏఈ రఘోత్తోమ్ రెడ్డి మండల రైతులు వినియోగదారులతో మంచి సత్సంబంధాలు కొనసాగించారు.
ముఖ్యంగా గాలిదూమారాలు తుఫాన్లు పెనుగాలులు వీచి చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ నిలిచిపోయినప్పుడు పగలు రాత్రి అని తేడాలేకుండా ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా సిబ్బంది తో కలిసి చెట్లను స్వయంగా తొలగించేవారు. అసమయంలో విద్యుత్ కి అంతరాయం కలిగినప్పుడు సరిపడా సిబ్బంది లేకపోవడంతో గ్రామాల్లో ఉండే ప్రైవేటు ఎలక్ట్రాషియన్ల ను సంప్రదించి విద్యుత్ పునరుద్ధరణ చేసేవారు. పెండింగ్ బకాయిల వసూళ్లలో కిందిస్థాయి సిబ్బందితో కలిసి ఎక్కడకూడా పై అధికారిననే అహంకారం ప్రదర్శించ కుండా హుందతనంగా చాకచక్యంగా వ్యవహరిస్తూ వసూళ్లు చేసేవారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సూమారు పదిహేను మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు బియ్యం, నిత్యావసరుకులు ప్రతి వ్యక్తికి వేయి రూపాయాలు చొప్పున అందించారు. అదే విధంగా పదిహేను మంది ప్రైవేటు ఎలక్ట్రాషియన్లకు సంవత్సరానికి రూ.ఐదు లక్షల భీమా వర్తించేలా ఇన్స్ రెన్స్ కట్టారు. మండలంలో విద్యుత్ శాఖ అధికారి సిహెచ్ రఘోత్తోమ్ రెడ్డి పనితీరు పట్ల మండల రైతులు వినియోగదారులు వ్యాపారులు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం అభినందించదగ్గ విషయమేకాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే రఘోత్తోమ్ రెడ్డి లాంటి అధికారి కి ప్రజల్లో ఎనలేని అదరణ లబించడం అదృష్టంగా భావించాలని చెప్పుకోవచ్చు.
రైతులంటే అమితమైన అభిమానం ఉన్న ఏఈ : సింగరాయపాలెం రైతు దొడ్డపనేని క్రిష్ణార్జున్ రావు
మండల విద్యుత్ శాఖ అధికారి చల్లా రఘోత్తోమ్ రెడ్డికి రైతులంటే అమితమైన అభిమానం ఉంటుంది. మా గ్రామంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు అడిగిన వెంటనే సకాలంలో అందించారు. ఇటువంటి వ్యక్తి మా మండలంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం.
మాది వ్యవసాయ కుటుంబమే : ఏఈ సిహెచ్ రఘోత్తోమ్ రెడ్డి
మాది వ్యవసాయ కుటుంబమే. రైతులు విద్యుత్ లేనిది వ్యవసాయం చేయలేని పరిస్థితి నేడు ఉంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటి వరకు తోటి సిబ్బందితో కలిసి రైతులు వినియోగదారుల సమస్యల పరిష్కరంకోసం నావంతు సేవలు అందిస్తూన్నా. ముఖ్యంగా ఇంటి బిల్లులు వ్యవసాయ బిల్లులు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది తో కలిసి గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను రైతులను చైతన్యపరస్తూ బిల్లులు కట్టించాను. విద్యుత్ మోటర్లకు క్యాపసిటర్లు ఏర్పచుకోవాలని రైతులను కలిసి అవగాహన కల్పించాను.