Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరాటే పిచ్చయ్యకు బ్లాక్‌బెల్ట్ పురస్కారం
- ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
ఖీజాతీయస్థాయిలో సత్తుపల్లికి కరాటే పిచ్చయ్య వన్నె తీసుకొచ్చారని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక కళాభారతి ఆడిటోరియంలో లయన్ బుడోకాన్ కరాటే హెల్త్‌క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన 2021 కరాటే బ్లాక్‌బెల్ట్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 25 ఏండ్లుగా సత్తుపల్లి పట్టణంలో వేలాదిమంది విద్యార్థులకు కరాటే శిక్షణను ఇస్తూ జాతీయస్థాయిలో పోటీలను సైతం సత్తుపల్లిలో నిర్వహించి జాతీయస్థాయిలో సత్తుపల్లికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారని ఈ సందర్భంగా పిచ్చయ్యను అభినందించారు. ఈ సందర్భంగా 15 మంది విద్యార్థులకు ఉగాది పర్వదినం సందర్భంగా కరాటే క్లబ్ వారు ఎమ్మెల్యే చేతుల మీదుగా బ్లాక్బెల్ట్లు ప్రదానం చేయించారు. కరాటే హెల్త్‌క్లబ్ ఛైర్మెన్ చిత్తలూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు పిచ్చయ్య, బాలస్వామి, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, పట్టణ ఎస్సై గజ్జల నరేశ్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, దేవరపల్లి ప్రవీణ్‌కుమార్, కరాటే సభ్యులు సుందరరావు, ప్రసాద్, వెంకట్రావ్, చెన్నారావు, కోట సత్యనారాయణ, దారా ఏసురత్నం, విద్యార్థులు పాల్గొన్నారు.