Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత రాజ్యంగా నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇరత ప్రధాన కూడళ్లు, కుల, ప్రజా, కార్మిక, విద్యార్ధి, యువజ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల వారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన సెంటర్ పోస్టాఫీస్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. జిల్లా జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, కలెక్టర్ ఎంవి.రెడ్డి, అదనపు కలెక్టర్ డి.అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ డి.అనుదీప్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూయ, ఎస్సీ కార్పోరేషన్ ఈడి పులిరాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డిఓ మధుసూదన్ రాజు, ఆర్ అండ్ బి. ఈఈ భీమ్లా, కలెక్టరేట్ సిబ్బంది గన్యా, రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద సులానగర్ గ్రామంలో ఇల్లందు నియోజక వర్గ శాసనసభ్యురాలు భానోత్ హరిప్రియ నాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బుధవారం నివాళులర్పించి, ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్, ఎంపీపీ భూక్యా రాధ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు చంద్రశేఖర్ రావు, బసవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వామపక్ష పార్టీలు, యూటీఎఫ్ ఆధ్వర్యంలో
వామపక్ష పార్టీల నాయకులు రేపాకుల శ్రీనివాస్, బానోత్ ఊక్ల, రాంచందర్, ధర్మపురి వీరబ్రహ్మ చారి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు భూక్య కిషోర్ సింగ్‌లు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు గోల్యాతండ సేవాలాల్ గుడి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసం నరసింహరావు, కడుదుల వీర న్న, టీచర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కార్యాలంలో : మండల కేంద్రమైన టేకులపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మదనయ్య, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, భూక్య దల్ సింగ్, భూక్య దేవా నాయక్, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
షర్మిల పార్టీ నాయకులు నివాళి
షర్మిల పార్టీ నాయకులు గోల్యాతండ సేవా లాల్ గుడి వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తల్లాడ : మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు గ్రామగ్రామాన వీధివీధిన ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ(ఎం) నాయకులు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు, మండల కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ చల్ల రంగయ్య, పులి వెంకట నరసయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
గుండాల : మండల అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో ఎన్డీ జిల్లా నాయకులు మాచర్ల సత్యం, ఈసం శంకర్, బి.వెంకన్న, కొమరం శాంతయ్య, చం ద్రయ్య, రామచందర్, అజరు, జగన్, సీపీఐ మండల నాయకులు రమేష్, సీపీఐ(ఎం) మం డల నాయకులు జోగ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మామకన్ను సర్పంచ్ ముత్యమాచారి, పాపారావు పాల్గొన్నారు.
ఎంపీటీసీ ఎస్కే సంధాని, సర్పంచులు ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, ఎన్డీ సబ్ డివిజన్ నాయకులు, గుండాల సర్పంచ్ కోరం సీతరాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు లు, మామకన్ను సర్పంచ్ కొడెం ముత్యమాచారి అన్నారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్బగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకులు పర్శిక రవి, న్యూడె మోక్రసీ నాయకులు వై.వెంకన్న, తుడుందెబ్బ నాయకులు వాగబొయిన చంద్రయ్య, ఏజన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు బొమ్మెర సత్యం పాల్గొన్నారు.
మామకన్ను గ్రామ పంచాయతీలో...
మండలంలోని మామకన్ను గ్రామ పంచాయతీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, మామకన్ను సర్పంచ్ ముత్యమాచారి, ఉప సర్పంచ్ కల్తి కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
భద్రాచలం : టీఎన్జీవోస్ ప్రెసిడెంట్ డెక్క నరసింహారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయం తిని ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే జనరల్ సెక్రెటరీ గగ్గురి బాలకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పడిగ నరసిం హారావు, నాగభూషణం, శ్రీనివాస్, నర్సింహా రావు, అపర్ణ, శ్రీనివాస్, నాగరాజు, అంజిబాబు, అన్వర్, బాబా తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ సమావేశ హాల్లో.... ఐటీడీఏ సమావేశ హాల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉప సంచాలకులు రమాదేవి ఐటీడీఏ యూనిట్ అధికారులు సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ మేనేజర్ సురేందర్, ఏడీఎంహెచ్ఓ శ్రీనివాసులు, డీటీఆర్‌ఓ ఎఫ్ఆర్ శ్రీనివాస్, సీసీ గణేష్, సంబంధిత యూనిట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
దళిత సంక్షేమ సంఘం, అంబేద్కర్ యువజన సంఘా ఆధ్వర్యంలో
అంబేద్కర్ జయంతి వేడుకలను దళిత సంక్షేమ సంఘం, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఎన్న్జీవో మాజీ జిల్లా అధ్యక్షు లు చల్లగుళ్ళ నాగేశ్వరరావు, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చ య్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్య క్షులు వెంకటేశ్వర్లు, రవికుమార్, పాల్గొన్నారు
చండ్రుగొండ : మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ బానోతుపార్వతి అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తహశీల్దార్ కార్యాలయం రెవిన్యూ సిబ్బంది నివాళులర్పించారు. సీపీఐ(ఎం) కార్యాలయంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ బానోత్ పార్వతి, జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎస్టీ రసూల్, జడ్పీటీసీ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీటీసీ దారా బాబు వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు: అంబేద్కర్ జయంతి వేడుక లను ఎమ్మార్పీఎస్ టీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మోదుగు రామకృష్ణ అధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు మంద సురేష్, ఎంఈఎఫ్ జిల్లా నాయకులు మణికుమార్, జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పినపాక : అంబేద్కర్ జయంతి వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, అధికారులు, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల ఆధ్వర్య ంలో అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు బోడ రమేష్ కొనియాడారు. ఎల్చిరెడ్డి పల్లి పంచాయతీలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం, అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు.
కొత్తగూడె :మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అద్యక్షులు సింగమాల వెంకటర మణయ్య ఆదేశానుసారంగా జిల్లా బాబాక్యాంపు హెడ్ ఆఫీసు సమీపంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళిఅర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అలెం వెంకటేశ్వర రావు,స్టేట్ జనరల్ సెక్రటరీ మైస గోవర్ధన్, స్టేట్ సెక్రటరీ డి. కిరణ్ కుమారి, స్టేట్ సెక్రటరీ వనితారాణి, జిల్లా చైర్మన్ ఎస్కె. షహనాజ్, జిల్లా గౌరవ అద్యక్షులు విద్యాసాగర్, జిల్లా అద్యక్షులు యస్.అప్పారావు, పాల్గొన్నారు.
సేవా మహారాజ్ లంబాడీ సాధన సమితి ఆధ్వర్యంలో...
సేవా మహారాజ్ లంబాడీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ ధర్మానాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థా పకులు గుగులోత్ తారాబాయి, ప్రధాన కార్యదర్శి బాబురావు, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్, పంతుల్యనాయక్, సేవాలాల్ జిల్లా నాయకులు శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జయంతి వేడుకల్లో మండల ప్రజాప్రతినిధులను అధికారులను, సామాజిక కార్యకర్తలను, ఈ సందర్భంగా సన్మానం నిర్వహించారు. సన్మానం పొందిన వారిలో ఎంపీపీ బానోత్ పార్వతి, జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎస్టీ రసూల్, జెడ్పీటీసీ కొడకండ్ల వెంకటరెడ్డి, ఎంపీడీవో డి.అన్నపూర్ణ, ఎంపీఓ తోట తులసీరామ్, మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్సు శంకరమ్మ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నరేష్, సీపీఐ, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు బోజ్జ నాయక్, వారాది సత్యనారాయణ, యాస నరేష్, బొర్రా కేశవ్, పాత్రికేయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి విభాగం సంఘం రాష్ట్ర నాయకులు మూడు బాలాజీ నాయక్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు రెడ్డిపోగు సురేష్, ఏజెన్సీ దళిత ఉద్యమ సంఘం మండల అధ్యక్షుడు దినేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ లంక విజయలక్ష్మి ఆధ్వర్యంలో
మండలం తిప్పనపల్లి గ్రామంలోని దళిత కాలనీలో ఎంపీటీసీ లంక విజయలక్ష్మి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గానుగపాడు సహకార సొసైటీ సీఈఓ, మున్నూరు కాపు సంగం మండల అధ్యక్షులు లంక నరసింహారావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జీవన కొనసాగిం చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, దళిత సంఘం నాయకులు నడ్డి రవి, వివిధ ప్రజా సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్బంగా బుధవారం అఖిల భారత ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను స్థానిక అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వనమా, పలు సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ సంఘం పట్టణ అధ్యక్షులు కాల్వ ప్రకాష్ రావు అధ్యక్షతన నిర్వహించగా, డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, సంఘం అధ్యక్షులు కాల్వ భాస్కర్‌రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, కేటీపీఎస్ సీఈ పి.వెంకటేశ్వరరావు, ఎస్.ఈ గుర్రం రాజ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని బూర్గంపాడు మండల కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వామపక్ష నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ జిల్లా నాయకులు ముద్ద భిక్షం, సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి సీతారాంరెడ్డి, నాయకులు భయ్యా రాము, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : అంబేద్కర్ జయంతిని మండల వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రాహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. పట్టణం లోని మూడు రోడ్ల కూడలిలోని మహనీయుల విగ్రహాలు సముదాయంలో గల అంబేద్కర్ విగ్రాహానికి, దొంతికుంట, పేటమాలపల్లి, నారాయణపురం ఎస్సీ కాలనీలో గల అంబేద్కర్ విగ్రహాలకు పలు కుల సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అలాగే వ్యవసాయ కళాశాల, ప్రొఫెసర్ జయశంకర్ ప్రెస్ క్లబ్లోను జయంతి వేడుకలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు అర్జున్, చిరంజీవి, షణ్ముఖి తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : మండలంలోని పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలోని శాంతినగర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహ సర్కిల్‌ల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహిం చారు. అనంతరం శాంతినగర్, కోడిశాలకుంట, పగిడేరు, మొట్లగూడెం, కొత్తూరు గ్రామాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తాటి సావిత్రి, ఎంపీటీసీ కుంజాక్రిష్ణ కుమారి, ఉప సర్పంచ్ దాయకర్, స్వేరో నాయకులు కరణాకర్, మాజీ సర్పంచ్ భిక్షం గ్రామస్తులు ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలు నిర్వహించి, మాట్లాడారు.
బీటీపీఎస్ ఆవరణంలో : బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బీటీపీఎస్ ఆవరణంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్య కమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
చర్ల : అంబేద్కర్ జయంతి వేడుకలు మండల మాల మహానాడు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మాల మహానాడు మండల అధ్యక్షుడు తోటమల్ల గోపాలరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లా డారు. ఈ సమావేశంలో మాల మహానాడు గౌరవధ్యక్షుడు కొంగూరు నర్సింహరావు, ప్రధాన కార్యదర్శి మైపా జోగారావు, ఉపాధ్యక్షుడు తడికల నరేష్, కోడిరెక్కల బాబురావు, సంయుక్త కార్యదర్శులు, మేడబత్తని గోవర్ధన్, తడికల బుల్లెబ్బాయి, ప్రసార కార్యదర్శి ముసలి సతీష్, సంయుక్త కార్యదర్శి జయబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : దేశంలో మతోన్మాద బీజేపీ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీపీఐ(ఎం), టీఏజీఎస్, కేవీపీఎస్, సీఐటీయు నేతలు పిలునిచ్చారు. అంబేదర్క్ జయంతి సందర్భంగా కొత్త బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం సంఘాల నేతలు వేరువేరుగా పూలమాలలు వేసి ఘంనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు అబ్దుల్ నబి, దేవులపల్లి యాకయ్య, తాళ్లూరి కృష్ణ, కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి పిట్టల రవి, మోహన్ రావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు వజ్జ సురేష్ మాట్లాడారు.
సింగరేణి ఆధ్వర్యంలో ...
స్ధానిక జేకే ఏరియాలోని అంబేద్కర్ విగ్రహానికి జీఎం పీవి సత్యనారాయణ ఆధ్వర్యం లో బుధవారం అధికారులు పూలమా లలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం బండి వెంటయ్య, అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ప్రభాకర్‌రావు, పర్సనల్ లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో...
కొత్తబస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ, ఎన్డీ, టీడీపీి, వైఎస్ఆర్సీపీ, తుడుందెబ్బ తదితర అనేక సంఘాల నేతలు బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అశ్వాపురం : అంబేద్కర్ 130వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహానికి జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, సీఐ సట్లరాజు, సర్పంచ్ బానోత్ శారద పూలమాలను వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ఆర్అండ్బి ప్రధాన రహదారి వద్ద, బాబుజగ్జీవన్‌రావు కాలనీ, ప్రభుత్వ కార్యాలయాలలో వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో గద్దల నాగేశ్వరరావు, కొడారి వెంకటేశ్వర్లు, భూక్య చందులాల్, సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, కృష్ణ, రామకృష్ణ తదిరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల అభివృద్ధి కార్యాలయంలో ఎండీఓ రేవతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లలిత, సర్పంచ్ పద్మ, పంచాయతీ కార్యదర్శి గురునాధారావు తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, ఎంపీవో సునీల్, మండల అధ్యక్షులు రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగేశ్వరరావు, రామలింగం, శ్రీనువాసు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.