Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో కరోనా కేసులు ఉదృతి పెరుగుతుంది. గత రెండు రోజులుగా రెండంకెల సంఖ్యలో కేసులు పెరుగు తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం కారేపల్లి పీహెచ్సీ, మోబైల్ టెస్టింగ్ వ్యాన్ ద్వారా 64 మందికి పరీక్షలు చేయగా 12 మందికి కోవిడ్ పాజిటీవ్‌గా తెలింది. గ్రామాల వారిగా భాగ్యనగర్‌తండా, అనంతారం గ్రామాల్లోముగ్గురు చొప్పున, కారేపల్లి, ఇద్దరు, గాంధీనగర్, గుట్టకిందిగుంపు, తులిశ్యాతండా, గోవింద్‌తండా గ్రామాల్లో ఒక్కొకరు చొప్పున కరానో బారిన పడినట్లు వైద్యాధికారి డాక్టర్ వై.హన్మంతరావు తెలిపారు. కేసు పెరుగుతండటంతో వ్యాక్సినేషన్‌కు ప్రజలు తరలివస్తున్నట్లు తెలిపారు. బుధవారం సెలవు దినమైన 92 మంది లబ్ధిదారులకు వ్యాకినేషన్ వేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోవటంతో పాటు మాస్కులు ధరించాలని భౌతిక దూరం ప్రతిఒక్కరు పాటించాలని కోరారు.