Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ అని సాంఘిక సంక్షేమ శాఖ ఖమ్మం ఉపసంచాలకులు కస్తాల సత్యనారాయణ అన్నారు. మండల పరిధిలోని రాపల్లి గ్రామంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఐదు మండలాల స్థాయి క్రికెట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి రూ 10,116 ఆళ్లపాడు క్రికెట్ టీమ్ కు అందజేశారు. రెండవ బహుమతి రూ 7116 రాపల్లి క్రికెట్ టీం కు, మూడవ బహుమతి రూ 5116 పెద్దగోపతి క్రికెట్ టీం అందజేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత సిపిఐ జిల్లా నాయకుడు ఏనుగు గాంధీ, జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, టిఆర్ఎస్ మధిర నియోజకవర్గ మాజీ ఇన్చార్జి బొమ్మెర రామ్మూర్తి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు , సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు, సిపిఐ నాయకులు మంద వెంకటేశ్వర్లు , మోదుగు పుల్లారావు, సాధినేని సీతారామ కష్ణ, తోట చలపతి, కాంగ్రెస్ నాయకులు ఏనుగు జనార్ధన్ రావు, సిపిఎం నాయకులు నల్లమల నాగేశ్వరరావు, స్వేరోస్ మండల అధ్యక్షులు కన్నెపొగు రాజేష్, యువశక్తి యూత్ సభ్యులు తిరుపతిరావు, మురళి, రాజా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : అంబేద్కర్ 130 వ జయంతి ఉత్సవా లను ఘనంగా నిర్వహించారు. జిల్లా షర్మిల పార్టీ ప్రతినిధి టి.కె మోహన్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ కూడలిలో ఈ జయంతి కార్యక్రమంలో అయన మాట్లాడారు. కార్యక్రమంలో వడ్లకొండ శ్రీనివాస్, జల్లెపల్లి సైదులు, ధర్మస్ రాము నాయక్, ఆలూరి నరేంధర్, బాణోత్ రాంబాబు నాయక్, వీరా రెడ్డి, పసీరుద్దీన్, పానం జోషి, తల్లాపల్లి అశోక్, దార బాబు పాల్గొన్నారు
వేంసూరు : మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మండల ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యూత్ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
కొణిజర్ల : టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్వాపురం అడ్రోడ్ లోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా నాయకులు రాయల పుల్లయ్య, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు చల్లా మోహన్ రావు,ఎంపీటీసీల సంగం మండల అధ్యక్షులు బురా ప్రసాద్, సుడా డైరెక్టర్ బండారు కష్ణ, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దరవత్ బాబులాల్, సురభి వెంకటప్పయ్య,సర్పంచ్ పరికపల్లి శ్రీను,మండల నాయకులు ,రచ్చ రామకోటయ్య పాల్గొన్నారు.
కారేపల్లి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబుసాహెబ్ అంబేద్కర్ జయంతిని బుధవారం కారేపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై పీ.సురేష్ కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. కారేపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని జరిపారు. అంబేద్కర్ కలలు కన్న సమాజ నిర్మాణంలో అందరు భాగస్వాములం అవుతామంటూ ప్రతిజ్ఞచేశారు. పేరుపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ సేవలను కొనియాడారు. తొడితలగూడెం గ్రామపంచాయతీ, గాంధీపురంలోని గిరిజన గురుకుల కళాశాలలో జయంతి ఉత్సవాలను జరిపారు. ఈకార్యక్రమంలో సంత ఆలయం చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు,వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ప్రజాసంఘాల నాయకులు ఆదెర్ల రాములు, తలారి దేవప్రకాశ్, చెవుల వెంకటేశ్వర్లు, మెదరి వీరప్రతాఫ్(టోనీ), తోటకూరి పిచ్చయ్య, అజ్మీర వీరన్న, అడ్డగోడ ఐలయ్య, ఇమ్మడి తిరుపతిరావు, ఆదెర్ల శంకర్రావు, చింతల శ్రీను, శనగ రాంబాబు, ఆదెర్ల రామారావు, పీరయ్య, సర్పంచ్‌లు ఆదెర్ల స్రవంతి, బానోతు కుమార్, ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్, కోఆప్షన్ ఎండీ.హనీఫ్, గిరిజన గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ చింతా రామనాధం, ప్రముఖ న్యాయవాది గోవర్ధనగిరి దశరధ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వీరునాయక్, శ్యామ్‌లాల్,రవి, శ్రీకాంత్, శివకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.