Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజుకు చేరిన ఉత్సవాలు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన భక్తుల పాలిట కొంగుబంగారమై వెలుగొందుతున్న కలియుగ ప్రత్యక్ష దైవం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వసంత నవరాత్రి బ్రహ్మౌత్సవాల్లో రెండోరోజు ప్రాతః అర్చన లతోపాటు గోపూజ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు, సకల దేవతా స్వరూపం అయిన మహాలక్ష్మిని పూజించి సమస్త పాపములు నశించి ముక్కోటి నదులలో స్నానం ఆచరించిన పుణ్యం లభిస్తుందని ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ తెలిపారు, శాస్త్రములు, ప్రమాణములు, ఉత్సవ క్రతువులలో ప్రతి సంవత్సరం వలె శ్రీవారి పాదమునకు విశేష పంచామతాలతో అభిషేకం నిర్వహించారు, రాతిని నాతిగ చేసిన పాదం సిరులకు నెలవైన శ్రీవారి పాదమునకు పంచామతాలతో వేద మంత్రోచ్ఛారణలతో అభిషేకం నిర్వహించారు, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు పంపిణీ చేశారు, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమాలను ఆలయ కార్య నిర్వహణాధికారి జగన్మోహనరావు ధర్మకర్తల మండలి చైర్మన్ ఉప్పల కష్ణ మోహన్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు విజయ దేవశర్మ, అర్చక బందం, ఆలయ సిబ్బంది, భక్తులు, పాల్గొన్నారు,