Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
మహిళా, శిశు, వికలాంగుల, వయోవద్ధుల సంక్షేమ శాఖ ద్వారా సమకూర్చిన ఉచిత సహాయ పరిరాలను వికలాంగులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అందజేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ బుధవారం నగరం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వారికి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమప్రాధాన్యతనిచ్చి అక్కున చేర్చుకునే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ అభివద్ధి పథకాలే నిదర్శనమన్నారు. గతంలో ప్రభుత్వం తరపున దివ్యాంగులకు రూ.500 వికలాంగుల పించన్ ఇచ్చేవారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు రూ.3016- లకు పెంచడం జరిగిందని, అవసరమైన అర్హత కలిగినవారందరికి సహాయ పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి దివ్యాంగులకు పెట్రోల్‌తో నడిచే మూడు చక్రాల వాహానాలు ఇద్దరికి, బ్యాటరీ వీల్చైరు ముగ్గిరికి, మూడు చక్రముల బండ్లు చేతి కర్రలు, వినికిడి యంత్రములు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్జన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జిల్లా సంక్షేమశాఖాధికారి సి. హెచ్. సంధ్యారాణి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.